ప్రవాస స్త్రీశక్తి అవార్డుకు ఎన్‌ఆర్‌ఐ పద్మజ
Published Fri, Sep 30 2016 11:16 PM | Last Updated on Thu, Oct 4 2018 5:35 PM
కిర్లంపూడి :
ప్రవాస స్త్రీశక్తి 2016 అవార్డుకు కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ మహిళ ఉసిరికళ్ల పద్మజ ఎంపికైంది. ఈ అవార్డును ప్రవాసీ బతుకమ్మ పండుగ సందర్భంగా అక్టోబర్ రెండోతేదీన ఆమె అందుకోనుంది. అమెరికన్ తెలంగాణ అసోసియేషన్, ప్రవాసిమిత్ర పత్రిక కలిపి అక్టోబర్ 2న హైదరాబాద్‌లో ప్రవాస బతుకమ్మ పండుగను నిర్వహించనున్నారు. ఉసిరికళ్ల తాతాజీ, పద్మజ దంపతులు17 ఏళ్లుగా దోహఖత్తర్‌లో ఉంటున్నారు. అక్కడ సాంఘిక సాంస్కృతిక రంగాల్లో చేస్తున్న కృషికి గాను పద్మజకు ఈ అవార్డును అందజేస్తున్నారు.
Advertisement
Advertisement