అనంతపురం న్యూసిటీ : డ్వాక్రా మహిళలు నెట్ బ్యాకింగ్‌పై అవగాహన పెంచుకోవాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ లక్ష్మీకాంతం అన్నారు. ఆదివారం స్థానిక ఉమానగర్‌లోని మొరార్జీదేశాయ్ పాఠశాలలో మెప్మా ఆధ్వర్యంలో నగదు రహిత చెల్లింపులు, బ్యాంకింగ్‌పై జరిగిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అందరికీ బ్యాంకు ఖాతా తప్పనిసరి అని, అలాగే నెట్ బ్యాంకింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు.
రూపే కార్డులను తీసుకుని దాని ద్వారా నగదు రహిత లావాదేవీలు చేసుకోవాలన్నారు. జన్‌ధన్ యోజన కింద అకౌంట్ ఉండే వారు రూ 50 వేలు జమ చేసుకునే సదుపాయం ఉందన్నారు. స్వైపింగ్ మిషన్లు కావాలనుకునే వారికి వారం రోజుల్లో బ్యాంకర్లు అందజేస్తారన్నారు. చౌకధాన్యపు డిపోల్లో సైతం రూపే కార్డులను ఉపయోగించి నితావసర సరుకులు పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ సావిత్రి, టీపీఓ కృష్ణమూర్తి, సిండికేట్ బ్యాంకు మేనేజర్ వంశీకిరణ్ తదితరులు పాల్గొన్నారు.
నెట్ బ్యాంకింగ్‌పై అవగాహన తప్పనిసరి
Published Sun, Nov 27 2016 11:03 PM | Last Updated on Mon, Sep 4 2017 9:17 PM
Advertisement