– ఏప్రిల్ నుంచి తొలి విడతగా మున్సిపాలిటీల్లో పంపిణీ
– జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం
అనంతపురం అర్బన్ : జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లోని చౌక ధరల దుకాణాల్లో ఏప్రిల్ నెల నుంచి తెల్లకార్డుదారులకు కిలో కందిపప్పు, శనగ పప్పు, ఉద్దిపప్పు రూ.50 చొప్పున పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తొలి విడతగా మున్సిపాలిటీల్లో అమలు చేస్తున్నామని, తరువాత మండలాల్లో పంపిణీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంపిణీలో డీలర్లు అవకతవకలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా డీలరు కంది పప్పు, శనగ పప్పు, ఉద్ది పప్పు ఇవ్వకున్నా, తక్కువ తూకంతో ఇస్తున్నా తక్షణం జిల్లా సరఫరాల అధికారి 80083 01418 నంబర్‌కి ఫిర్యాదు చేయాలని తెలియజేశారు.
రూ.50కి కిలో కందిపప్పు
Published Fri, Mar 17 2017 11:50 PM | Last Updated on Tue, Sep 5 2017 6:21 AM
Advertisement
Advertisement