పాడేరు, న్యూస్‌లైన్: గిరిజన సంక్షేమ గురుకు లం సొసైటీ, రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో ఏజెన్సీలోని నడుస్తున్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ) స్పెషలాఫీసర్ పోస్టుకు డిమాండ్ పెరిగింది. బంగారు బాతుల్లాంటి వీటి బాధ్యతలు చేపట్టేందుకు ఉపాధ్యాయులు పోటీపడుతున్నారు. పైరవీలు చేపడుతున్నారు. డ్రాపౌట్ గిరిజన బాలికల అక్షరాస్య త కోసం మన్యంలో 11 విద్యాలయాలు ఉన్నా యి. ఒక్కోపాఠశాలలో 200 మంది చొప్పున మొత్తం 2200 మంది బాలికలు వీటిల్లో విద్యనభ్యసిస్తున్నారు. చదువుతోపాటు భోజనం, వసతి సౌకర్యాలు వీరికి కల్పిస్తున్నారు. ఒక్కో బాలికకు నెలకు రూ.750 మెస్ చార్జీలను ప్రభుత్వం మంజూరు చేస్తోంది. గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలలతో పోల్చుకుంటే వీటిల్లో బాగా మిగులుతుందన్న వాదన ఉంది.
అంతే కాకుండా వీటిల్లో మెనూ సక్రమంగా అమలు కావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. స్పెషలాఫీసర్ పోస్టుతో నాలుగు డబ్బులు వెనకేసుకోవచ్చని యోచిస్తున్నవారూ ఉన్నారు. ఈమేరకు మూడేళ్ల నుంచి పైరవీలతోపాటు రాజకీయాలూ చోటుచేసుకుంటున్నాయి. రెండేళ్ల నుంచి ఎస్జీటీ మహిళా టీచర్‌లే స్పెషలాఫీసర్లుగా డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్, ఆపైస్థాయి ఉపాధ్యాయులు, పదవీ విరమణ పొందిన వారికి నియమించాలనే నిబంధనలు ఉన్నప్పటికీ ఏజెన్సీలోని అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు.
ఉదాహరణకు పాడేరు,జి.మాడుగుల, డుంబ్రిగుడ పాఠశాలల్లో ఎస్జీటీలే ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఇలా డిప్యుటేషన్‌తో నిర్దేశిత పాఠశాలల్లో విద్యాబోధనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల పూర్తిగా పాఠశాలలు మూతపడిన పరిస్థితులునెలకొన్నాయి. గత ఏప్రిల్ 26 నాటికే స్పెషలాఫీసర్ల డిప్యుటేషన్ రద్దయింది. అయినా ఇప్పటికీ పాతవారే కొనసాగుతున్నారు. స్కూల్ అసిస్టెంట్‌ల నియామకానికి ఓ ఉన్నతాధికారి చర్యలు చేపట్టడంతో పలువురు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఎస్జీటీలు కూడా ఈ విద్యాసంవత్సరంలో కొనసాగడానికి పైరవీలు చేపట్టారు.
పారదర్శకంగానే నియామకాలు
ఏజెన్సీలోని కేజీబీవీల్లో స్పెషల్ ఆఫీసర్‌ల నియామకం నిబంధనల మేర కు పారదర్శకంగానే జరుపుతామని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో వై.నర్సింహారావు‘ న్యూస్‌లైన్’కు తెలిపారు. డిప్యుటేషన్‌పై నియామకాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్తామని చెప్పారు.
బంగారుబాతు ‘కస్తూర్బా’
Published Mon, Aug 12 2013 1:50 AM | Last Updated on Fri, Sep 1 2017 9:47 PM
Advertisement
Advertisement