ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దూరవిద్య విధానంలో బీఈడీ అభ్యసిస్తున్న (ఇన్ సర్వీస్ టీచర్ ) విద్యార్థులకు ఆగష్టు 1 నుంచి దూరవిద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు షెడ్యూల్‌ను పరీక్షల విభాగం అధికారులు ఖరారు చేశారు. ఆగస్టు 1న ఫండమెంటల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, 2న సైకాలజీ టీచింగ్ అండ్ లర్నింగ్, 03న స్కూల్ మేనేజ్‌మెంట్ , 04న ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ, 05న టీచింగ్ మెథడ్స్–1, 06న టీచింగ్ మెథడ్స్–2, 07న మెథడ్స్ ఆఫ్ టీచింగ్ 1,2 (ఫిజికల్ సైన్సెస్) సబ్జెక్టులకు పరీక్షలు జరుగుతాయి.