లబ్ధిదారులూ.. ఆందోళన వద్దు | benifisers are dont worry | Sakshi
Sakshi News home page

లబ్ధిదారులూ.. ఆందోళన వద్దు

Published Thu, Jul 28 2016 12:16 AM | Last Updated on Tue, Jul 24 2018 2:17 PM

మొక్కలు నాటుతున్న పిడమర్తి రవి తదితరులు - Sakshi

మొక్కలు నాటుతున్న పిడమర్తి రవి తదితరులు

  •  ఎంపికైన అందరికీ సబ్సిడీ రుణాలు
  •  పేద దళితులను రైతులుగా చూడటమే ప్రభుత్వ లక్ష్యం
  • ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి
  • మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం: ఎంపికైన లబ్ధిదారులు అందోళన చెందాల్సిన అవసరం లేదని అందరికీ సబ్సిడీ మంజూరు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ పిడమర్తి రవి చెప్పారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయం ఆవరణంలో హరితహారం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.సబ్సిడీ మంజూరు చేసేందుకు నిధులు విడుదలయ్యాయని తెలిపారు. విడతల వారిగా అందరికీ మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. 1221 మందికి రూ.42కోట్లతో కొనుగోలి చేసిన 4వేల ఎకరాల భూమి పంపిణీకి సిద్ధంగా ఉందని తెలిపారు. నిరుపేద దళితులను రైతులుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గత రెండేళ్లలో రూ.360కోట్లు ఖర్చు వెచ్చించి రాష్ట్ర వ్యాప్తంగా 3,222 మందికి మూడెరాల భూమిని పంపిణీ చేసినట్లు వివరించారు. భూమిలేని దళితులందరికీ మూడెకరాల భూమి పంపిణీ చేస్తామన్నారు. ప్రస్తుతం అందజేస్తున్న సబ్సిడీని 80శాతం నుంచి 90శాతానికి పెంచేందుకు కృషి చేస్తామని అన్నారు. 
     ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ సర్వయ్య మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో భాగంగా కొందుర్గు మండలం వెంకిర్యాలలో మూడు కుటుంబాలకు పంపిణీ చేసి 9 ఎకరాల భూమిలో చైర్మన్‌ టేకు మొక్కలు నాటారని తెలిపారు. నిరుద్యోగులకు వృత్తి విద్యా శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధిని కల్పిస్తున్నామని అన్నారు. బ్యాంకర్లు నిర్లక్ష్యం చేయకుండా సబ్సిడీ మంజూరైన వారందరికీ వెంటనే రుణాలు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్‌ ఈఓ అశోక్, ఉద్యోగులు ఖలీల్, హన్మంతు, గఫార్‌ పాల్గొన్నారు. 
     
    వర్గీకరణ సాధనకు ఢిల్లీలో ధర్నా
    పాలమూరు: ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలుపుతూ 119 ఎమ్మెల్యేల సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీర్మానం చేశారని దాన్ని గెలిపించేందుకు కేంద్రంపై పోరాటం చేస్తానని మాదిగ జేఏసీ చైర్మన్‌ పిడమర్తిరవి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అథితి గృహంలో ఏర్పాటు చేసిన మాదిగ జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్గీకరణకు అనుకూలంగా కేసీఆర్‌ తీర్మానం చేస్తే 8మంది మాల ఎమ్మెల్యేలు ప్రశ్నించలేదని, కనీసం టీడీపీ, కాంగ్రెస్‌కు చెందిన మాలలు కూడా ప్రశ్నించలేదని గుర్తు చేశారు. ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఉంటూ మాదిగ ఉద్యమంలో పాల్గొంటున్నారని కొందరు విమర్శలు చేస్తున్నారని ఇది సరికాదన్నారు. 25ఏళ్ల వర్గీకరణ ఉద్యమాన్ని విద్యావంతుల, యువకుల ఉద్యమంగా మార్చాలన్నారు. ఆగష్టు 8,9,10 తేదీలలో వర్గీకరణ సాధనకు మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో చేపట్టనున్న ధర్నాకు విద్యార్థులు, యువత, ఉద్యోగులు, జర్నలిస్టులు, డాక్టర్లు, తరలిరావాలని కోరారు. మల్లన్నసాగర్‌లో నాలుగు ఊర్లు పోతున్నాయని, పోలవరంలో 400ఊర్లు పోయాయని అన్నారు. 20ఏళ్లుగా సాగుతున్న వర్గీకరణ ఉద్యమానికి కోదండరాం ఎందుకు మద్ధతు తెలపడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో 119 రోజులు జైలు జీవితం గడిపిన తాను, వర్గీకరణ సాధించే వరకు పోరాటం చేస్తానన్నారు. కార్యక్రమంలో మాదిగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాయికంటి రాందాస్, ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు సింగిరెడ్డి పరమేశ్వర్, నాయకులు సుందర్, మైనర్‌బాబు, గోపాల్, నంచర్ల శ్రీను, బొర్రసురేష్, దినేష్, పాతూరి రమేష్ పాల్గొన్నారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement