బస్సును ఢీకొన్న బైక్
- ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు
వికారాబాద్ రూరల్ : వేగంగా వెళుతూ ముందుగా వస్తున్నా బస్సును వెనుక వైపున ఢీ కొట్టిన సంఘటనలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలైన సంఘటన వికారాబాద్ పట్టణంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని మద్గుల్ చట్టంపల్లి గ్రామానికి చెందిన సురేష్, జే. రవీందర్, బోయిని శ్రీనివాస్‌లు వికారాబాద్ నుంచి గ్రామానికి బైక్‌పై వెళుతున్నారు. హైదరాబాద్ 2 డిపో నుంచి తాండూరుకు వస్తున్నా టీజే08యూబీ5679 బస్సును వికారాబాద్ ఆర్టీసీ డిపో ముందు బైక్‌పై వెళుతున్న వీరూ వేగంగా బస్సు వెనుక టైర్ వద్ద ఢీ కొట్టారు. దీంతో బైక్ ముందుభాగం పూర్తిగా నుజ్జునుజై యువకులు రోడ్డుపై పడ్డడంతో ముగ్గురి కాళ్లు విరిగాయి. ఇందులో సురేష్ కుడి కాలు పూర్తిగా విరుగడంతో రోడ్లుపై వారి రోధనలను మిన్నంటాయి. వెంటనే ప్రయాణికులు స్థానికులు అక్కడికి చేరుకుని వారిని 108, ఆటోలో వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు రిఫర్ చేశారు.