
నేనూ సొగసుగత్తెనే..
‘అందం ఒకరి సొంతం కాదు.. అద్దంలో చూసుకుంటే నేను కూడా సొగసుగత్తెనే... మీలో ఎవరైనా కాదంటారా? అయితే పక్కనే ఉన్న నా వాణ్ని అడిగి చూడండి... నన్ను మించిన సౌందర్యం మరెక్కడా లేదని అంటున్నాడు’ అన్నట్లుగా ఉంది కదూ ఈ చిత్రంలోని పిచ్చుకల హావభావాలు! పెద్దవడుగూరులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ద్విచక్ర వాహనానికి ఉన్న అద్దాల్లో ఈ పిచ్చుకలు గంటల తరబడి చూసుకుంటూ.. అద్దాన్ని ముద్డాడాయి. ఈ దృశ్యాన్ని చూసిన పలువురు ఔరా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
- పెద్దవడుగూరు (తాడిపత్రి)