ప్రొద్దుటూరుటౌన్: ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి వైఎస్సార్‌సీపీ, టీడీపీలు విప్ జారీ చేశాయి. శుక్రవారం మున్సిపల్ కమిషనర్ చాంబర్‌లో ఎన్నికల అధికారి వినాయకంకు వైఎస్సార్‌సీపీ పట్టణాధ్యక్షుడు చిప్పగిరిప్రసాద్, నాయకుడు పెంచలయ్య, చినరాజ విప్ పత్రాన్ని అందించారు. అలాగే టీడీపీ పట్టణాధ్యక్షుడు ఘంటసాల వెంకటేశ్వర్లు ఎన్నికల అధికారికి విప్ పత్రాన్ని ఇచ్చారు. ఏ పార్టీ బీఫాంతో గెలిచిన కౌన్సిలర్లు ఆపార్టీ తరపున నిలబడిన చైర్మన్ అభ్యర్థికే ఓటు వేయాలని ఇందులో పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు తిరిగి విత్‌డ్రా చేసుకునే సమయం ఉన్నా ఎవ్వరూ వెనక్కి తీసుకోలేదు. వైఎస్సార్‌సీపీ తరపున పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పట్టణాధ్యక్షుడికి విప్ జారీ చేసే అధికారాన్ని ఇచ్చారు.
కౌన్సిలర్ల ఇళ్లకు విప్ నోటీసులు...
టీడీపీ కౌన్సిలర్లు శిబిరాలకు వెళ్లడంతో వారి ఇళ్లవద్దకు వెళ్లి నోటీసులు అతికించి సాక్షి సంతకాలు చేయించుకొని ఎన్నికల అధికారికి ఇవ్వనున్నారు. టీడీపీలోనే రెండు వర్గాలుగా ఏర్పడ్డ ముక్తియార్, ఆసం రఘురామిరెడ్డి వర్గీయ కౌన్సిలర్లు విప్ పత్రాలను కౌన్సిలర్ల ఇళ్లవద్ద అతికించేందుకు వెళితే కుటుంబ సభ్యులు చేయమని చెప్పడంతోపాటు మా ఇళ్ల వద్ద కరిపించవద్దని టీడీపీ నాయకులతో వాగ్వాదానికి దిగారు. అయినా తప్పని పరిస్థితిలో అతికించి ఫొటోలు తీసుకోవాల్సి వచ్చింది.
ఇరుపార్టీలు విప్ జారీ
Published Fri, Apr 14 2017 11:13 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
Advertisement