పుల్లేరు కాలువలో బాలుడి గల్లంతు
పుల్లేరు కాలువలో బాలుడి గల్లంతు
Published Tue, Sep 6 2016 9:32 PM | Last Updated on Fri, Jul 12 2019 3:29 PM
వినాయకుడిని చూసేందుకు ళ్లగా ప్రమాదం
కొనసాగుతున్న గాలింపు చర్యలు
కురుమద్దాలి(పామర్రు) :
వినాయక చవితి వేడుకుల్లో సోమవారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. దేవుడి చూద్దామని వెళ్లిన బాలుడు కాలువలో గల్లంతు అయ్యాడు. వివరాలు.. బీసీ కాలనీకి చెందిన ఆరేపల్లి శ్రీనివాసరావు, మేరీ దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమార్తె కామాక్షి స్థానిక పాఠశాలలో చదువుతోంది. కుమారుడు కార్తీకేయ(4) పామర్రులోని ఏఎన్‌ఎం స్కూల్‌లో ఎల్‌కేజీ చదువుతున్నాడు. ఇంటి వద్ద పూజలు ముగిసిన తరువాత పుల్లేరు కాలువ గట్టుపై ఏర్పాటు చేసిన వినాయకుడి మండపం వద్దకు వెళ్లేందుకు చిన్నారులు బయలుదేరారు. దారిలో కామాక్షి స్నేహితురాలు కలిసి కార్తీకేయను మండపం వద్ద నేను తీసుకువెళ్తానని చెప్పడంతో బాలుడి అక్క తిరిగి ఇంటికి వెళ్లి పోయింది. పందిరి వద్దకు వెళ్తూ దారిలో పుల్లేరులో చేపలు బాగా ఉన్నాయి చూద్దామని ఇద్దరూ కలిసి కాలువలోకి దిగారు. దీంతో కార్తీకేయ అదుపు తప్పి కాలువలోకి పడిపోయాడు. ఈ విషయాన్ని స్నేహితురాలు పరుగున వచ్చి ఆమె తల్లిదండ్రులకు తెలిపింది. వారు వచ్చి కార్తీకేయ తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పింది. సోమవారం మధ్యాహ్నం నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకూ కాలువలో గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. 9వ తేదీ పుట్టిన రోజు జరుపుకోవాల్సిన చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Advertisement