
కాలువలో పడి మృతి చెందిన మురగయ్య
చిత్తూరు అర్బన్ : నగరంలోని కొంగారెడ్డిపల్లెలో మురుగునీటి కాలువలో పడి జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మురగయ్య (65) మృతిచెందారు. ఎస్‌ఆర్‌పురం జెడ్పీటీసీ సభ్యుడిగా, ఎంపీపీగా పనిచేసిన మురగయ్య చిత్తూరు రీడ్స్‌పేటలో కాపురముంటున్నారు. మంగళవారం కొంగారెడ్డిపల్లె వైపు నుంచి కాలినడకన ఇంటికి వస్తుం డగా పక్కనే ఉన్న మురుగునీటి కాలువలో పడిపోయారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. వన్‌టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment