సెల్ఫీ తెచ్చిన తంటా.. | boy missing with selfie time | Sakshi
Sakshi News home page

సెల్ఫీ తెచ్చిన తంటా..

Published Tue, Oct 4 2016 11:12 PM | Last Updated on Fri, Jul 12 2019 3:29 PM

సెల్ఫీ తెచ్చిన తంటా.. - Sakshi

సెల్ఫీ తెచ్చిన తంటా..

- కాల్వలో పడి విద్యార్థి గల్లంతు
ఉరవకొండ : మండల పరిధిలోని లత్తవరం సమీపంలో హంద్రీనీవా కాలువ వద్ద ఓ విద్యార్థి సెల్పీ తీసుకుంటూ ప్రమాదశాత్తు కాలు జారి కాలువలో పడి గల్లంతయ్యాడు. దసరా సెలవులు కావడంతో తోటి స్నేహితులతో కలసి సరదాగా లత్తవరం సమీపంలో ఉన్న హంద్రీ–నీవా కాలువ వద్దకు వచ్చారు. కాలువలో స్నేహితులు ఈత కొడుతుండగా ఉరవకొండకు చెందిన షాబాజ్‌ కాలువ గట్టుపై నిలబడి మొబైల్‌లో సెల్ఫీ తీసుకునేందుకు యత్నించాడు. ప్రమాదవశాత్తు కాలుజారి అందులో పడ్డాడు. వారం రోజుల నుంచి కాలువలో నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో షాబాజ్‌ గల్లంతయ్యాడు.

స్నేహితులు చాలాసేపు గాలించినా ఫలితం లేకపోయింది. షాబాజ్‌ తల్లిదండ్రులు వహిదుల్లా, ఫరీదాభానులకు స్నేహితులు సమాచారం అందించారు. హుటాహుటిన వారు హంద్రీ–నీవా కాలువ వద్దకు చేరుకుని గాలింపు చేపట్టారు. గల్లంతైన షాబాజ్‌ పట్టణంలోని వివేకానంద పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. తమ కుమారుడు స్నేహితులతో కలసి సరదాగా వెళ్లి తిరిగివస్తాడనుకుంటే కనబడకుండా పోయాంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. షాబాజ్‌ గల్లంతైన విషయం స్థానిక రెవెన్యూ అధికారులు, పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని విద్యార్థి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement