బీపీఎస్ ఆదాయం రూ.72.86 కోట్లు
Published Wed, Sep 28 2016 11:31 PM | Last Updated on Tue, Oct 16 2018 7:36 PM
నిడదవోలు : మునిసిపల్ రీజియన్ పరిధిలోని ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలో ఉన్న మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో గతేడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ పథకం (బీపీఎస్) ద్వారా 20,451 దరఖాస్తులు అందాయని, వీటి ద్వారా రూ.72.86 కోట్ల ఆదాయం సమకూరిందని మునిసిపల్ టౌన్ ప్లానింగ్ రీజినల్ డెప్యూటీ డైరెక్టర్ పీఎస్‌ఎన్ సాయిబాబు తెలిపారు. నిడదవోలులో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ బీపీఎస్ పథకం ద్వారా దరఖాస్తు చేసుకున్న భవన యజమానులు నిర్మాణాలు చేపట్టకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామనిహెచ్చరించారు. అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులు ఈనెల 30లోపు వారి డాక్యుమెంట్టు అప్‌లోడ్ చేసుకుని మిగిలిన సొమ్మును వెంటనే చెల్లిస్తే ఆన్‌లైన్ ద్వారా అనుమతులు లభిస్తాయని చెప్పారు. టౌన్ ప్లానింగ్ అధికారి ఎన్.హరిబాబు పాల్గొన్నారు.
Advertisement
Advertisement