క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్
Published Wed, Oct 26 2016 10:21 PM | Last Updated on Mon, Sep 4 2017 6:23 PM
–రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో కర్నూలు బాలబాలికల జట్లు విజయం
నందికొట్కూరు: క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ అన్నారు. నందికొట్కూరులోని అక్షరశ్రీ స్కూల్ ఆవరణలో జరుగుతున్న 62వ అండర్–14 రాష్ట్రస్థాయి బాలబాలికల కబడ్డీ పోటీలు హోరాహోరీగా సాగాయి. బుధవారం ఫైనల్ పోటీలు నిర్వహించారు. బాలికల విభాగంలో విశాఖపట్నం జట్టుపై 22 పాయింట్లతో కర్నూలు జట్టు విజయం సాధించింది. మూడవ స్థానం ప్రకాశం, కృష్ణ జట్టు నాలుగో స్థానంలో నిలిచాయి. బాలుర విభాగంలో గుంటూరు జట్టుపై కర్నూలు జట్టు 25 పాయింట్ల తేడాతో విన్నర్‌గా నిలిచింది. ఈస్ట్‌గోదావరి మూడవ స్థానం, ప్రకాశం జట్టు నాలుగో స్థానంలో నిలిచాయి. అనంతరం విజేత జట్లకు ఎస్పీ బహుమతులు అందజేసి మాట్లాడారు. క్రీడలతో స్నేహ సంబంధాలు బలపడతాయని చెప్పారు. గెలుపోటములను సమానంగా స్వీకరించాలని చెప్పారు. కార్యక్రమంలో డీఎస్పీ సుప్రజ, సీఐ శ్రీనాథరెడ్డి, ఎంఈఓ రంగారెడ్డి, ఎస్‌ఐలు లక్ష్మీనారాయణ, రాజ్‌కుమార్, సుబ్రమాణ్యం, హెచ్‌ఎం సుబ్బారాయుడు, పోలీసు సిబ్బంది, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం నాయకులు శ్రీనాథ్, జాకీర్, రవికుమార్, నాగరాజు, రాజేశ్వరి, రత్నకుమారి, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement