క్యాబ్ వాలాను బెదిరించి కారుతో పరారు.. | cab driver threatened and some fellows escape the car in hyderabad | Sakshi
Sakshi News home page

క్యాబ్ వాలాను బెదిరించి కారుతో పరారు..

Published Sat, Oct 8 2016 12:17 PM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM

క్యాబ్ వాలాను బెదిరించి కారుతో పరారు.. - Sakshi

క్యాబ్ వాలాను బెదిరించి కారుతో పరారు..

హైదరాబాద్: కారు కిరాయికి కావాలంటూ ఫోన్ చేసిన దుండగులు..డ్రైవర్‌ను బెదిరించి దోచుకుని కారుతో పరారయ్యాడు. దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిదిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంజమూర్‌కు చెందిన రమావత్ బాషా ఓలా క్యాబ్ డ్రైవర్ కమ్ ఓనర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత వనస్థలిపురం నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ముగ్గురు వ్యక్తులను బాకారం వరకు తీసుకెళ్లాల్సి ఉంటుందని అందులో చెప్పారు.

అతడు సూరారం వద్దకు వెళ్లగానే రోడ్డుపై నిలుచున్న ముగ్గురు వ్యక్తులు కారును అడ్డుకున్నారు. బాషాను బెదిరించి రూ.2,000 నగదుతోపాటు సెల్‌ఫోన్ లాక్కుని కారుతో ఉడాయించారు. బాధితుడు స్థానికుల సాయంతో దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బొంగులూరు గేట్ వద్ద ఆ కారును గుర్తించిన ఆదిభట్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇది పసిగట్టిన దుండగులు తప్పించుకునేందుకు కారును మరో మార్గంలోకి మళ్లించబోయారు. ఈ క్రమంలో కారు బోల్తా పడింది. దీంతో కారును అక్కడే వదిలేసి అందులోని వారు పరారయ్యారు. పోలీసులు సంఘటన స్థలిలో పడి ఉన్న రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని, దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

 

.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement