పందిరి సాగుతో పరుగులు | Canopy cultivation profitable | Sakshi
Sakshi News home page

పందిరి సాగుతో పరుగులు

Published Sat, Oct 8 2016 9:32 PM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM

క్షీరసాగర్‌లో పందిరి విధానంలో కాకరతోట సాగు

క్షీరసాగర్‌లో పందిరి విధానంలో కాకరతోట సాగు

పెరుగుతున్న కాకర సాగు విస్తీర్ణం
సత్ఫలితాలు సాధిస్తున్న రైతులు
మెలకువలు పాటిస్తే మరింత మేలు
గజ్వేల్‌ ఉద్యాన అధికారి చక్రపాణి సలహాలు, సూచనలు

గజ్వేల్‌: పందిరి విధానంలో కాకర సాగుతో రైతులు సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఈ పంట సాగు జిల్లాలో రోజురోజుకూ విస్తరిస్తోంది. పంట సాగులో పాటించాల్సిన మెలకువలపై గజ్వేల్‌ ఉద్యాన అధికారి చక్రపాణి (సెల్‌: 83744 49345) సలహాలు, సూచనలు మీ కోసం...

విత్తన రకాలు(సాధారణం): పూసాదోమౌసమి, కోయంబత్తూర్‌ గ్రీన్‌లాంగ్, కో-వైట్‌ లాంగ్, అర్కహరిత, పూసా, విశేష్, డీకే-1, ప్రియ, మహికో గ్రీన్‌లాంగ్‌

హైబ్రీడ్‌ రకాలు: ఎంబీటీహెచ్‌-101, 102, ఎస్‌.ఎస్‌-431, 432, బీఐటీ-711, శ్వేత, పూనం, శ్రేయ, ప్రాచీ, పాలి.

విత్తన మోతాదు:
ఎకరాకు 1.8 నుంచి 2.4 కిలోలు

రెండు వరుసల మధ్య దూరం:
వేసవిలో 1.5 మీటర్లు
ఖరీఫ్‌లో 2.5 మీటర్లు

వరుసలో రెండు పాదుల మధ్య దూరం:
వేసవిలో 0.5 మీటర్లు
ఖరీఫ్‌లో 0.75 మీటర్లు

విత్తే పద్ధతి:
భూమి మీద పాకించే పాదులకు, వర్షాకాలంలో నీటి కాల్వలకు తోడుగా మురుగు నీరు పోవడానికి 2 మీటర్ల దూరంలో కాల్వలు చేయాలి. వేసవిలో వేసే పాదులకు పొలం అంతటా నీటిపారుదలకు బోదెలు చేయాలి. 15X10 సెం.మీల పాలిథిన్‌ సంచుల్లో విత్తుకొని 15-20 రోజులు పెరిగిన తర్వాత అదును చూసి పొలంలో విత్తుకోవాలి.

విత్తనశుద్ధి:
కిలో విత్తనానికి 3 గ్రాముల థైరమ్‌, 5 గ్రాముల చొప్పున ఇమిడాక్లోప్రిడ్‌ ఒకదాని తర్వాత మరోటి కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఆ తర్వాత 100 గ్రాముల విత్తనానికి 2 గ్రాముల చొప్పున ట్రైకోడెర్మావిరిడితో విత్తనశుద్ధి చేయాలి.

ఎరువులు:
విత్తే ముందు ఎకరాకు 8-10 టన్నుల పశువుల ఎరువు, 32-40 కిలోల భాస్వరం, 16-20 కిలోల పొటాష్‌నిచ్చే ఎరువులను గంటలో వేయాలి. నత్రజని (32-40) రెండు సమపాళ్లుగా చేసి విత్తిన 25-30 రోజులకు, పూత పిందె దశలో వేసుకోవాలి. మొక్కకు దగ్గరలో ఎరువు వేయకూడదు. ఎరువు వేసిన వెంటనే మట్టిని కప్పి నీరు పెట్టాలి.

కలుపు నివారణ, అంతర కృషి:
కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసేయాలి. 2-3 తడుల తర్వాత మట్టిని గుల్ల చేయాలి. ఎకరాకు పెండిమిథాలిన్‌ 1.2 లీటర్ల నీటిని కలిపి విత్తిన 24-48 గంటల్లోపు నేలకు పిచికారీ చేయాలి. మొక్కలు 2-4 ఆకుల దశలో ఉన్నప్పుడు లీటర్‌ నీటికి 3 గ్రాముల బొరాక్స్‌ కలిపి ఆకులపై పిచికారీ చేస్తే ఆడపూలు ఎక్కువగా పూసి పంట దిగుబడి అధికంగా ఉంటుంది. సీసీసీ 250మి.గ్రాముల లేదా మాలిక్‌ హైడ్రోజన్‌ 50 మీ.గ్రాములు లీటర్ల నీటికి కలిపి కూడా ఈ దశలో పిచికారీ చేయవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement