28 కిలోల గంజాయి పట్టివేత | Capture 28 kg of marijuana | Sakshi
Sakshi News home page

28 కిలోల గంజాయి పట్టివేత

Published Sun, Sep 25 2016 12:18 AM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM

Capture 28 kg of marijuana

కాజీపేట రూరల్‌ : కాజీపేట జంక్ష¯ŒSలో శనివారం 28 కిలోల గంజాయిని జీఆర్‌పీ పోలీ సులు పట్టుకున్నారు. కాజీపేట జీఆర్‌పీ సీఐ మధుసూద¯ŒS కథనం ప్రకారం... అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన దొంతి రామాంజనేయులు అన్నవరంలో 28 కిలో ల గంజాయిని కొనుగోలు చేశాడు. ఆ గం జాయితో అనంతపురం నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కాడు. అయి తే రైల్వే అధికారులు విజయవాడ రూట్‌ రిలే ఇంటర్‌ లాకింగ్‌ సిస్టం ఆధునీకరణ పనుల కారణంగా ఈ రైలును కాజీ పేట జంక్ష¯ŒS మీదుగా దారి మళ్లించారు. ఈ క్రమంలో కాజీపేట జంక్ష¯ŒSకు చేరుకున్న రైలు నుంచి గంజాయి బ్యాగుతో అతడు దిగాడు. పక్కన బ్యాగు పెట్టి ప్లాట్‌ఫాంపై నిల్చొని అటుఇటు దిక్కులు చూస్తుండగా పెట్రోలింగ్‌ చేస్తున్న పోలీస్‌ సిబ్బందికి అనుమానం వచ్చి తనిఖీ చేయగా గంజాయి తరలింపును ఒప్పుకున్నాడు. రూ.42,000 విలువైన గంజాయి బ్యాగును స్వాధీనం చేసుకొని రామాంజనేయులును అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement