పుట్లూరు : మండలంలోని సూరేపల్లి గ్రామానికి చెందిన గుర్రప్ప అనే రైతు ఫిర్యాదు మేరకు విశ్రాంత తహసీల్దార్ రామచంద్రారెడ్డితో పాటు మరో ఇద్దరు రెవెన్యూ సిబ్బందిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేష్‌బాబు తెలిపారు. గత జూన్ 30న తహసీల్దార్‌గా రామచంద్రారెడ్డి పదవీ విరమణ పొందిన విషయం తెలిసిందే. అయితే ఆయన పదవీ విరమణ చేస్తున్న రోజే సూరేపల్లి రెవెన్యూలో 180 సర్వే నంబర్‌లో తనకు చెందిన 5.27 ఎకరాల భూమిలో ఆదిలక్ష్మమ్మ అనే మహిళకు 1.72 ఎకరాల భూమిని ఆన్‌లైన్ చేసి మోసం చేశారని రైతు గుర్రప్ప ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ విషయమై విశ్రాంత తహసీల్దార్ రామచంద్రారెడ్డి, ఆర్‌ఐ రాజ్‌కుమార్, వీఆర్వో సంజీవ్‌పై గుర్రప్ప ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఐపీసీ 420, 506, 34 సెక‌్షన్ల కింద కేసు నమోదు చేశారు.