మూడు గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటన
Published Sun, Sep 18 2016 12:11 AM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM
కమలాపూర్ : కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుతీరును పరిశీలించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని బృందం మండలంలోని గుండేడు, పంగిడిపల్లి, గోపాల్‌పూర్ గ్రామాల్లో శనివారం పర్యటించింది. బృంద సభ్యులు గ్రామస్తులతో సమావేశమయ్యారు. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, స్వయం సహాయక సంఘాల పనితీరు, ఉపాధిహామీ పనులు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ ప్రగతిని పరిశీలించారు. ఉపాధికూలీలు, ఐఎస్‌ఎల్ లబ్ధిదారులతో మాట్లాడారు. ఉపాధిహామీ పనులను వ్యవసాయరంగానికి అనుసంధానం చేయాలని, పనిదినాలు పెంచాలని పలువురు గ్రామస్తులు కేంద్ర బృందం సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీపీ లక్ష్మణ్‌రావు, సర్పంచులు రాజబోస్, రజిత, ఎంపీటీసీ పద్మ, ఉపసర్పంచ్ వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ పీడీ అరుణశ్రీ, ఎంపీడీవో పద్మావతి, ఈవోపీఆర్డీ రవిబాబు, ఐకేపీ ఏసీ నిర్మల, ఏపీఎం నారాయణ, ఈజీఎస్ ఈసీ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement