central officers
-
కేంద్ర ప్రభుత్వ అధికారులపై విచారణ జరిపిస్తాం! మమత స్ట్రాంగ్ వార్నింగ్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు ఎక్కువైపోతున్నాయంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంపై మండిపడ్డారు. దీన్ని సహించేదిలేదని తేల్చి చెప్పడమే కాకుండా కేంద్ర ప్రభుత్వ అధికారుల పై విచారణ జరిపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు మమతా తమ పార్టీ విద్యార్థి విభాగం ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ... తనపై కూడా సీబీఐ, ఈడీ కేసులు ఉన్నాయని, అలాగే బెంగాల్‌లోని ఇతర కేంద్ర ప్రభుత్వాధికారుల పై కూడా కేసులు ఉన్నాయని చెప్పారు. కేంద్రం తమ అధికారులను ఢిల్లీకి రప్పిస్తే మీ అధికారులను ఇక్కడకు పిలిపిస్తాను అని హెచ్చరించారు. రాష్ట్రంలో సుమారు ఎనిమిది మంది కేంద్ర ప్రభుత్వాధికారులపై కేసులు ఉన్నాయని మమతా తెలిపారు. కేంద్రం సీబీఐ దాడులతో తమ నాయకులను అరెస్టులు చేస్తోందని విరుచుకుపడ్డారు. ఎడ్యుకేషన్ స్కాంలో పార్థ ఛటర్జీపై సీబీఐ జరిపిన దాడులు గురించి ప్రస్తావిస్తూ...ఆ కేసులో ఏదీ రుజువుకాలేదని, కేవలం రాజకీయపార్టీలను మీడియా, న్యాయవ్యవస్థను అడ్డుపెట్టుకుని బీజేపీ భయబ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపణలు చేశారు. ఈడీ, సీబీఐ దాడులతో తమ నాయకుల డబ్బులను కొల్లగొడుతోందని చెప్పారు. అంతేకాదు బిల్కిస్ బానో కేసులో దోషులుగా ఉన్నవారిని గుజరాత్ ప్రభుత్వం రిమిషన్ పాలసీ కింద విడుదల చేయడాన్ని కూడా తప్పుపట్టారు. ఆ దోషుల పై కఠిన చర్యలు తీసుకునేలా తమ పార్టీ టీఎంసీ కోల్‌కతాలో 48 గంటల పాటు ధర్నా నిర్వహిస్తుందని మమతా బెనర్జీ తెలిపారు -
సచివాలయ సేవలు దేశానికే ఆదర్శం
సాక్షి,ఒంటిమిట్ట: రాష్ట్రంలో సచివాలయాల సేవలు దేశానికే ఆదర్శమని, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగున్నాయని భారత ఆర్థిక వ్యవహారాల సంయుక్త కార్యదర్శి, ఆకాంక్ష జిల్లాల కేంద్ర ప్రాబరీ అధికారి పీయూష్ కుమార్ అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు విచ్చేసిన ఆయన...ఆదివారం జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జేసీ సాయికాంత్ వర్మతో కలిసి ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం సచివాలయ భవన సముదాయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను కలెక్టర్, జేసీలు ఆయనకు వివరించారు. గ్రామ సచివాలయ భవనంలో ప్రదర్శించిన ప్రభుత్వ పథకాల పోస్టర్లను, లబ్ధిదారుల జాబితా, రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన 2021–2022 సంక్షేమ క్యాలెండర్లను పరిశీలించారు. రైతు భరోసా కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.ఈ కార్యక్రమంలో వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్, జిల్లా వ్యవసాయ బోర్డు సలహా మండలి సభ్యులు ఆకేపాటి వేణుగోపాల్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులరెడ్డి, ఎంపీడీవో రాజేంద్రప్రసాద్, జెడ్పీసీఈవో సుధాకర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వరరావు, కడప తహసీల్దార్ శివరామిరెడ్డి, సచివాలయ సిబ్బంది, స్థానిక మున్సిపల్, రెవెన్యు సిబ్బంది పాల్గొన్నారు. -
త్వరలోనే మంచి సమాచారం వస్తుంది: విజయసాయిరెడ్డి
YSRCP MP Vijayasai Reddy: కేంద్ర కార్యదర్శుల బృందంతో ఏపీ ప్రతినిధుల బృందం భేటీ ముగిసింది. సుమారు రెండున్నర గంటలపాటు ఈ సమావేశం కొనసాగింది. సమావేశం అనంతరం , వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన వినతిపత్రం లోని అన్ని అంశాలను ఈ సమావేశంలో చర్చించామని,పరిష్కార మార్గాలను అన్వేషించామన్నారు. సమావేశం మొత్తం సానుకూలంగా జరిగిందని, త్వరలోనే మంచి సమాచారం వస్తుందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 20 మంది ఉన్నతాధికారులు, ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు సమావేశంలో పాల్గొన్నారని, దీనికి కొనసాగింపుగా సంబంధిత అధికారులు నిరంతరం సంప్రదింపులు చేసి, ఈ అంశాలన్నింటినీ ముందు తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. పోలవరం సవరించిన అంచనాలను యధావిధిగా ఆమోదించేందుకు ఒక అవగాహనకు వచ్చినట్లు తెలిపారు. పునరావాసం సహా అన్ని అంశాలపై రాష్ట్రానికి ప్రయోజనం కలిగే విధంగా చర్చలు జరిగాయని అన్నారు. ముఖ్యమంత్రికి, రాష్ట్రానికి ప్రధానమంత్రి ఇస్తున్న ప్రాధాన్యత కు ఈ సమావేశం నిదర్శనమని ఆయన అన్నారు. -
మూడు గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటన
కమలాపూర్ : కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుతీరును పరిశీలించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని బృందం మండలంలోని గుండేడు, పంగిడిపల్లి, గోపాల్పూర్ గ్రామాల్లో శనివారం పర్యటించింది. బృంద సభ్యులు గ్రామస్తులతో సమావేశమయ్యారు. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, స్వయం సహాయక సంఘాల పనితీరు, ఉపాధిహామీ పనులు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ ప్రగతిని పరిశీలించారు. ఉపాధికూలీలు, ఐఎస్ఎల్ లబ్ధిదారులతో మాట్లాడారు. ఉపాధిహామీ పనులను వ్యవసాయరంగానికి అనుసంధానం చేయాలని, పనిదినాలు పెంచాలని పలువురు గ్రామస్తులు కేంద్ర బృందం సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీపీ లక్ష్మణ్‌రావు, సర్పంచులు రాజబోస్, రజిత, ఎంపీటీసీ పద్మ, ఉపసర్పంచ్ వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ పీడీ అరుణశ్రీ, ఎంపీడీవో పద్మావతి, ఈవోపీఆర్డీ రవిబాబు, ఐకేపీ ఏసీ నిర్మల, ఏపీఎం నారాయణ, ఈజీఎస్ ఈసీ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.