విజయనగరం క్రైం: పోలీస్ క్లబ్‌ను పోలీస్ ఆఫీసర్స్ క్లబ్‌గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ ఎల్‌కేవీ రంగారావు తెలిపారు. బుధవారం సాయంత్రం పట్టణంలోని రంజనీ థియేటర్ పక్కనున్న పోలీస్ క్లబ్‌ను పరిశీలించారు. సిబ్బంది విశ్రాంతి తీసుకునేందుకు మంచాలు ఏర్పాటు చేశారు. అనంతరం మైడపైనున్న పిల్లర్స్‌ను పరిశీలించి, శిథిలావస్థకు చేరుకున్న వాటిని తొలగించి కొత్త పిల్లర్స్ వేయూలని సూచించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిల్లర్స్ వేసిన తర్వాత నూతన భవనం నిర్మించి ఆఫీసర్స్‌కు కేటారుుస్తామన్నారు. క్లబ్ కిందన పోలీసులు, పైన ఎస్సై ఆపైస్థారుు అధికారులు రెస్ట్ తీసుకుంటారని తెలిపారు. పనులు వేగంతంగా చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఓఎస్‌డీ సీహెచ్‌వీ అప్పలనాయుడు, విజయనగరం డీఎస్పీ ఎ.వి.రమణ, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ టి.త్రినాథ్, సీసీఎస్ డీఎస్పీ ఏఎస్ చక్రవర్తి, విజయనగరం వన్‌టౌన్ సీఐ వి.వి.అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ సిబ్బంది హర్షం
రెస్ట్ హౌస్‌పై ఎస్పీ దృష్టిసారించడంపై పోలీస్ అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2002లో అప్పటి ఎస్పీ సౌమ్యామిశ్రా పోలీస్ క్లబ్‌ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వచ్చిన ఎస్పీలు క్లబ్‌ను పరిశీలించారు కాని అభివృద్ధిపై దృష్టి సారించలేదు. ఎట్టకేలకు కొత్తగా వచ్చిన ఎస్పీ క్లబ్ అభివృద్ధిప దృష్టి సారించడంతో పోలీస్ అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రూపుమారనున్న పోలీస్ క్లబ్
Published Thu, Jun 9 2016 9:38 AM | Last Updated on Mon, Sep 4 2017 2:00 AM
Advertisement
Advertisement