తిరుపతి గాంధీరోడ్డు : ఖమ్మం జిల్లాకు చెందిన బాలిక కిడ్నాప్ కేసును అలిపిరి పోలీసులు బుధవారం ఛేదించారు. అలిపిరి సీఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పంచాయతీ రామచంద్రాపురం గ్రామానికి చెందిన సుబ్బారావు కుమారుడు శివకృష్ణ(22), అదేృగ్రామానికి చెందిన బాలిక(17)ను కిడ్నాప్ చేసినట్లు పదిరోజుల కిందట ఆ ఊరి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. వారిద్దరూ బుధవారం తిరుమలకు వచ్చారని ఖమ్మం పోలీసుల నుంచి తిరుమల పోలీసులకు సమాచారం అందింది. తిరుమల పోలీసులు వారికోసం ఆరా తీసి, వారిద్దరూ అప్పటికే తిరుమల వదిలి వెళ్లిపోయారని తెలుసుకున్నారు. వెంటనే అలిపిరి పోలీసులను అప్రమత్తం చేశారు. అలిపిరి పోలీసులు వాహనాలను తనిఖీ చేసి, శివకృష్ణ, బాలికను గుర్తించి అదుపులోకి తీసుMýృున్నారు. తాము ప్రేమించుకుంటున్నామని వారు తెలిపారు. పోలీసులు వారిద్దరికీ కౌన్సెలింగ్ నిర్వహించి, వారిని కొంతమంది పోలీసులతో తిరిగి ఖమ్మం పంపించారు.