in the
-
జిల్లాలో 104 డెంగీ, 694 మలేరియా కేసులు
మల్లవరం (తల్లాడ): జిల్లాలో ఈ సీజన్లో 104 డెంగీ, 694 మలేరియా కేసులు నమోదైనట్టు జిల్లా మలేరియా నివారణాధికారి డాక్టర్ రాంబాబు తెలిపారు. పక్షం రోజులుగా మల్లవరం గ్రామంలో డెంగీ, మలేరియా, వైరల్ జ్వరాలతో ప్రజలు అస్వస్థులైన విషయం పాఠకులకు విదితమే. దీంతో,ఆ గ్రామాన్ని శనివారం డీఎంఓ సందర్శించారు. తల్లాడ పీహెచ్సీ ఆధ్వర్యంలో ఏర్పాటైన వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ఎస్సీ కాలనీ, బీసీ కాలనీలను సందర్శించారు. జ్వర పీడితులను పరీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో డెంగీ, మలేరియా, టైఫాయిడ్, వైరల్ ఫీవర్ నివారణకు వైద్య శాఖ ఆధ్వర్యంలో వారం రోజులపాటు డ్రై డే కార్యక్రమం నిర్వహించనున్నట్టు చెప్పారు. జ్వరం సోకిన వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి వెళ్లి రక్త పరీక్షలు చేయించుకోవాలన్నారు. మురుగు గుంతల్లో దోమల మందు స్ప్రే చేశారు. కార్యక్రమంలో ఎస్పీహెచ్ఓ డాక్టర్ మాలతి, అసిస్టెంట్ మలేరియా నివారణాధికారి డాక్టర్ బన్సీలాల్, వ్యాధుల నివారణాధికారి డాక్టర్ తిరుపతి, మండల వైద్యాధికారి డాక్టర్ అర్షిదా, డాక్టర్ రత్నకుమార్ పాల్గొన్నారు. -
తగ్గుతూ.. పెరుగుతూ..
గోదావరి నీటిమట్టం 33 అడుగులు భద్రాచలం : ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో గోదావరికి నీటిమట్టం పెరుగుతోంది. వారం రోజులుగా గోదావరి తగ్గుతూ.. పెరుగుతూ దోబూచులాడుతోంది. భద్రాచలం వద్ద శనివారం సాయంత్రం 33 అడుగుల నీటిమట్టం నమోదైంది. ఆదివారం నాటికి 36 అడుగులకు పైగా చేరుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. భద్రాచలం వద్ద 43 అడుగులకు నీటిమట్టం చేరితేనే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. కానీ.. ఆ స్థాయిలో ప్రస్తుతం వరద రాదని కేంద్ర జలవనరుల సంఘం అధికారులు తెలిపారు. కాగా.. ఎగువ ప్రాంతంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. వాజేడు వద్ద కొంగాలవాగు నీరు రోడ్డెక్కటంతో అటువైపు ఉన్న గ్రామాలతో మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గోదావరి పరీవాహకంలో ఉన్న మండలాల అధికారులంతా క్షేత్రస్థాయిలో ఉంటూ.. తగిన చర్యలు చేపట్టాలని ఐటీడీఏ పీఓ, ఇన్చార్జి సబ్ కలెక్టర్ రాజీవ్ ఆదేశించారు. -
కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
తిరుపతి గాంధీరోడ్డు : ఖమ్మం జిల్లాకు చెందిన బాలిక కిడ్నాప్ కేసును అలిపిరి పోలీసులు బుధవారం ఛేదించారు. అలిపిరి సీఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పంచాయతీ రామచంద్రాపురం గ్రామానికి చెందిన సుబ్బారావు కుమారుడు శివకృష్ణ(22), అదేృగ్రామానికి చెందిన బాలిక(17)ను కిడ్నాప్ చేసినట్లు పదిరోజుల కిందట ఆ ఊరి పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. వారిద్దరూ బుధవారం తిరుమలకు వచ్చారని ఖమ్మం పోలీసుల నుంచి తిరుమల పోలీసులకు సమాచారం అందింది. తిరుమల పోలీసులు వారికోసం ఆరా తీసి, వారిద్దరూ అప్పటికే తిరుమల వదిలి వెళ్లిపోయారని తెలుసుకున్నారు. వెంటనే అలిపిరి పోలీసులను అప్రమత్తం చేశారు. అలిపిరి పోలీసులు వాహనాలను తనిఖీ చేసి, శివకృష్ణ, బాలికను గుర్తించి అదుపులోకి తీసుMýృున్నారు. తాము ప్రేమించుకుంటున్నామని వారు తెలిపారు. పోలీసులు వారిద్దరికీ కౌన్సెలింగ్ నిర్వహించి, వారిని కొంతమంది పోలీసులతో తిరిగి ఖమ్మం పంపించారు.