9 నుంచి జిల్లా స్థాయి చదరంగ పోటీలు
Published Wed, Aug 3 2016 9:02 PM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM
కరీంనగర్ స్పోర్ట్స్: జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 9, 10 తేదీల్లో కరీంనగర్‌లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో అండర్–25 జిల్లాస్థాయి చదరంగ పోటీలు నిర్వహిస్తున్నట్లు సమాఖ్య నిర్వహణ కార్యదర్శి రాజేంద్రప్రసాద్ తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈ నెల 12, 13 తేదీల్లో నల్గొండ జిల్లాలో రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని చెప్పారు. ఆసక్తిగల వారు రూ.100 ఎంట్రీ ఫీజు చెల్లించాలన్నారు. స్వీస్ లీగ్ పద్ధతిలో పోటీలు జరుగుతాయని, క్రీడాకారులు తమ వెంట చెస్ బోర్డు తెచ్చుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 94911 70659 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపిక
సుల్తానాబాద్ : మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బుధవారం జిల్లాస్థాయి వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి. ఇందులో ప్రతిభ కనబర్చిన వారిని అక్టోబర్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికచేశారు. మహిళలు 43 కేజీల విభాగంలో మమత, సమత,పూజిత, 47 కేజీల విభాగంలో సిరిచందన, నవ్య, మానుష, 52 కేజీల విభాగంలో శృతి, శ్రీవాణి, కళ్యాణి, 57కేజీల విభాగంలో పూజ, మమత, అలేఖ్య, 63 కేజీల విభాగంలో అతూల్య, లలిత, ముస్క, 73 కేజీల విభాగంలో సుప్రియ, తేజ, అఖిల, 84 కేజీల విభాగంలో సాయిదుర్గ, మంజుల, భావన ఎంపికయ్యారు. పురుషులు 59 కేజీల విభాగంలో జె.శ్రీనివాస్, ఎం. యశ్వంత్, వి.నరేష్, 66 కేజీల విభాగంలో పి.అనిల్‌కుమార్, జి. మురహరి, పి.మనోహర్, 74 కేజీల విభాగంలో పి.వంశీ, పి.రాందేవ్, ప్రదీప్, 83కేజీల విభాగంలో పి.శ్రావణ్, 93 కేజీల విభాగంలో ప్రణయ్, 105 కేజీల విభాగం శివకుమార్ ఎంపికైనట్లు నిర్వాహకులు రాజు, శారద, శంకర్ చెప్పారు. ఈ పోటీలను సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడు అంతటి అన్నయ్యగౌడ్ ప్రారంభించగా.. అంతర్జాతీయ క్రీడాకారిణి గొట్టె ముక్కుల శారద, ప్రచార కార్యదర్శి శంకర్‌గౌడ్, జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి రాజు, సీనియర్ క్రీడాకారుడు గాజుల రాయమల్లు, ప్రిన్సిపాల్ కల్పన, హెచ్‌ఎం ఖయ్యూమ్, పీఈటీలు రాజ్‌కుమార్‌గౌడ్, రమేష్‌గౌడ్, దాసరి రమేశ్, పాషా, ఉమారాణి పాల్గొన్నారు.
Advertisement
Advertisement