రాష్ట్రస్థాయి చెస్‌పోటీలలో పెద్దివీడు ఉన్నత పాఠశాల విద్యార్థి | chess compitition first prize in peddiveedu high school student | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి చెస్‌పోటీలలో పెద్దివీడు ఉన్నత పాఠశాల విద్యార్థి

Published Wed, Dec 21 2016 5:17 PM | Last Updated on Mon, Sep 4 2017 11:17 PM

chess compitition first prize in peddiveedu high school student

వీరబల్లి: ఈనెల 18, 19వ తేదీలలో విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి చెస్‌పోటీలలో వీరబల్లి మండలంలోని పెద్దివీడు రెడ్డివారిపల్లెలో గల జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఎం.వెంకటేశ్వర్లు ప్రధమస్థానం సంపాదించినట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవీంద్రబాబు తెలిపారు. ఏపీ చెస్‌ ఫెడరేషన్‌ తానా (తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా) ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలలో జిల్లానుంచి 7మంది విద్యార్థులు పాల్గొనగా తమ పాఠశాల విద్యార్థి ప్రథమస్థానం సంపాదించారన్నారు. ఈ విద్యార్థికి ఏపీ ఫెడరేషన్‌ తానా వారు బంగారుపథకంతోపాటు రూ.10వేలు నగదు, జ్ఞాపికను బహుమతిగా అందజేశారు. ఈ విద్యార్థిని పాఠశాలలోని పీఈటీ ఉమాదేవితోపాటు ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement