
చెస్ టోర్నీ విజేతలు వీరే
జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎస్‌ఆర్‌ఆర్, రామకృష్ణ చెస్ అకాడమీ సంయక్తంగా భారతీనగర్‌లోని శ్రీహర్ష స్కూల్‌లో ఆదివారం చెస్ టోర్నీ నిర్వహించారు.
విజయవాడ స్పోర్ట్స్: జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎస్‌ఆర్‌ఆర్, రామకృష్ణ చెస్ అకాడమీ సంయక్తంగా భారతీనగర్‌లోని శ్రీహర్ష స్కూల్‌లో ఆదివారం చెస్ టోర్నీ నిర్వహించారు. ఈ టోర్నీలో బాలుర విభాగంలో ఎం.నిరంజన్, సీహెచ్.మనోజ్, బాలికల విభాగంలో సీహెచ్.శర్వాణి, కె.తన్మయి వరుసగా మొదటి రెండు స్థానాలు సాధించారు. టోర్నీలో దాదాపు 60 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ నెల 25 నుంచి 30 వరకు నగరంలో జరిగే ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ టోర్నీకి ఎంపికయ్యారు. వీరితో పాటు ఈ టోర్నీలో అండర్–7 విభాగంలో జి.వర్మ, ఆర్.డోయల్‌నాయుడు, ఆండర్–9 విభాగంలో ఎన్.వర్షిత, జి.ప్రియాంక, అండర్–11 విభాగంలో టి.వెంకటసాయితేజ, పి.బృందా. అండర్–13లో జి.శశాంక్, జి.హర్షితదేవి, అండర్–15లో టి.ధీరజ్, జి.సేతు బంధన వరుసగా స్థానాల్లో విజేతలుగా నిలిచారు. శ్రీహర్ష స్కూల్ డైరెక్టర్ ఎన్.చౌదరి, ఏపీ చెస్ అసోసియేషన్ కార్యదర్శి డి.శ్రీహరి, ఎస్‌ఆర్‌ఆర్ చెస్ అకాడమీ డైరెక్టర్ డి.వరలక్ష్మి, కార్యదర్శి ఎన్‌ఎం ఫణికుమార్, రామకృష్ణ చెస్ అకాడమీ కార్యదర్శి ఎ.రామకృష్ణ పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు.