20 లోపు బకాయిలు చెల్లించాల్సిందే | Clear electricity dues before 20th | Sakshi
Sakshi News home page

20 లోపు బకాయిలు చెల్లించాల్సిందే

Published Wed, Nov 16 2016 1:42 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

20 లోపు బకాయిలు చెల్లించాల్సిందే - Sakshi

20 లోపు బకాయిలు చెల్లించాల్సిందే

  • ట్రాన్స్‌కో తిరుపతి జోన్‌ సీఈ నందకుమార్‌
  • చేజర్ల : జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పేరుకుపోయిన విద్యుత్‌ బకాయిలను ఈ నెల 20వ తేదీ లోపు చెల్లించాలని, లేకపోతే చర్యలు తప్పవని ట్రాన్స్‌కో తిరుపతి జోన్‌ సీఈ నందకుమార్‌ హెచ్చరించారు. మంగళవారం మండలంలోని బోడిపాడు సబ్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. సబ్‌స్టేషన్‌ ఆవరణలో మొక్కలు నాటి ఇంకుడుగుంతలను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో మంచచినీటి పథకాలు, ప్రభుత్వ పథకాలు వీధిలైట్లుకు సంబంధించి పంచాయతీలలో కోట్ల రూపాయలు విద్యుత్‌ బకాయిలు పేరుకుపోయాయని చెప్పారు. 20 లోగా బకాయిలు చెల్లించకపోతే సంబంధిత పథకాలకు సరఫరా నిలిపివేయడం జరుగుతుందన్నారు. విద్యుత్‌ చౌర్యానికి పాల్పడితే సహించేది లేదన్నారు. ఆయన వెంట టెక్నికల్‌ జోన్‌ డీఈ జగదీశ్వర్‌రెడ్డి, రూరల్‌ డీఈ విజయ్‌కుమార్, ఎమ్మార్జీ డీఈ రఘు, ఏడీ జనార్దన్, ఏఈ ప్రభాకర్‌  పాల్గొన్నారు. 
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement