హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిరిగి సోమవారం ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ సమావేశాలకు గంటముందుగా రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. వన్ టైం సెటిల్ మెంట్పై వాస్తవాలు ప్రజలకు వెల్లడించాలని ఉద్దేశంతో మంత్రులను త్వరగా రావాలని ఆదేశించినట్లు తెలిసింది. ఇక తెలంగాణ అసెంబ్లీలో నేడు విద్యుత్ అంశంపై చర్చ జరగనుంది.
ఇక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాట్ బిల్లు సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇక మూడు రోజులపాటు వాయిదా పడిన సభను సోమవారం కూడా స్తంభింపజేయాలని ప్రతిపక్షాలు భావిస్తుండగా అవసరం అయితే, ప్రతిపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు వేసైనా సమావేశాలను కొనసాగించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. మరోపక్క రేపు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరుగనుంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతి విద్యాసాగర్ డిప్యూటీ చైర్మన్గా ఎన్నికయ్యే అవకాశం ఉంది.
'మంత్రులూ.. గంట ముందే సభకు రండి'
Published Mon, Oct 5 2015 7:42 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM
Advertisement