జిల్లా నూతన కలెక్టర్‌గా వీరపాండియన్ ఈ నెల 24న బాధ్యతలు స్వీకరించవచ్చని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి.
అనంతపురం అర్బన్ : జిల్లా నూతన కలెక్టర్‌గా వీరపాండియన్ ఈ నెల 24న బాధ్యతలు స్వీకరించవచ్చని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆయన్ను ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌గా నియమించిన విషయం విదితమే. ఈ నెల 20న ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలో పాల్గొన్న వీరపాండియన్ అదే రోజు విజయవాడకు తిరిగి వెళ్లారు. శనివారం విజయవాడ కార్పొరేషన్‌లో రిలీవ్ అవుతారని సమాచారం. జిల్లా కలెక్టర్‌గా ఆయన ఎప్పుడు బాధ్యతలు స్వీకరిస్తారనే విషయంపై ఇప్పటి వరకు సమాచారం లేదని, అయితే.. 24న విధుల్లో చేరే అవకాశాలు ఉన్నాయని కలెక్టరేట్ వర్గాలు చెబుతున్నాయి.
కోన శశిధర్ రిలీవ్
కలెక్టర్ కోనశశిధర్ శుక్రవారం రిలీవ్ అయ్యారు. ఆయన్ను గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించిన విషయం విదితమే. శనివారం గుంటూరులో బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిసింది. ఆయనకు జిల్లా అధికారులు, అన్ని శాఖల సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు.