అచ్చం.. అప్పట్లాగే..
2012... ఆ సంవత్సరంలో జరిగిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా వాకాటి కరుణ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఉన్నారు. జాతర పనులు ప్రారంభమైంది మొదలు... తల్లులు గద్దెపైకి వచ్చి భక్తులు మొక్కులు చెల్లించే వరకు అన్ని ఏర్పాట్లను దగ్గర ఉండి చూసుకున్నారు. మొక్కులు సమర్పించే క్రమంలో రద్దీ ఒక్కసారిగా పెరగ్గా నేరుగా రంగంలోకి దిగి కట్టె పట్టుకుని మరీ క్యూలైన్లలో భక్తులను నియంత్రించారు.
ఇక ఈసారి 2016.. మళ్లీ జాతర వచ్చేసింది. కలెక్టర్‌గా కరుణ జాతరపై సంపూర్ణ అవగాహన ఉండటంతో ఏర్పాట్లను పకడ్బందీగా చేయించారు. జాతర ప్రారంభమయ్యూక గద్దెల సమీపంలోని మంచె పైనుంచి రద్దీని పరిశీలిస్తూ అధికారులకు తగిన సూచనలు చేస్తున్నారు. ఇక గురువారం ఉదయం గద్దెల సమీపంలో ఆమె కట్టె పట్టుకుని అధికారులకు సూచన ఇస్తుండడాన్ని చూసిన పలువురు 2012 జాతరలో ఆమె సేవలను గుర్తు చేసుకోవడం విశేషం.