కఠిన నిర్ణయాలతోనే మేలు..
కఠిన నిర్ణయాలతోనే మేలు..
Published Fri, Feb 19 2016 10:14 AM | Last Updated on Sun, Sep 3 2017 5:58 PM
2002 లో పోలీసుల సాయంతో రోడ్లు వేయించా..
మేడారం జాతర ప్రత్యేక అధికారి
కల్తీ వీరమల్లు
సాక్షి, హన్మకొండ : మేడారం అనగానే అశేష భక్తజన వాహినితో ఓలలాడే పవిత్రధామం. జాతర పరిసరాల్లో మౌలిక వసతుల కల్పనకు విశేష కృషి చేశారు కల్తీ వీరమల్లు. ఈక్రమంలో గతంలో ఆయన పలు హోదాల్లో కొన్ని కఠిన నిర్ణయా లను తీసుకున్నారు. అభివృద్ధి పనులను అడ్డుకున్న వారిని కట్టడి చేసేందుకు పోలీసుల సహకారమూ తీసుకున్నారు. 1989లో తాడ్వారుు ఎమ్మార్వోగా పనిచేసిన ఆయన... ఇప్పుడు మేడారం జాతర ప్రత్యేక అధికారిగా సేవలందిస్తున్నా రు. మేడారంతో తనకున్న అనుబంధం గురించి ఆయన ‘సాక్షి’కి వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే..
1979 లో తొలిసారి..
మా చిన్నప్పుడు 1979 సంవత్సరంలో తొలిసారిగా మా అమ్మానాన్నలతో మేడారానికి వచ్చాను. అప్పుడు జాతర పరిసరాల్లో కరెంటు ఉండేది కాదు. ఎన్టీఆర్ తొలిసారి అప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎం అయ్యాక.. కొంతమేర అభివృద్ధి పనులు మొదలయ్యూరుు. నేను చదువులు పూర్తిచేసి ఎమ్మార్వోగా ఎంపిక య్యూను. అనుకోకుండా మళ్లీ చల్లని తల్లులకు చేరువగా తాడ్వారుు ఎమ్మార్వోగా పనిచేసే అవకాశం 1989లో లభించింది. ఆ సమయంలోనే జాతర గురించి, మేడారం గురించి చాలావరకు అవగాహన కలిగింది. తర్వాతి కాలంలో నాకు పదోన్నతులు వచ్చారుు.
పనులు అడ్డుకున్నా.. వెనకంజ వేయలే
2001లో ఏటూరునాగారం, ఐటీడీఏ పీఓగా విధులు నిర్వర్తించాను. మళ్లీ తల్లుల ప్రాంతంలో గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధికి సేవలందించాను. నేను పీఓగా 2002లో జాతర అభివృద్ధి పనులు చేపట్టాను. భక్తుల రవాణా ఇబ్బందుల్లేకుండా చేయడానికి తొలి ప్రాధాన్యం ఇచ్చాను. అంతకుముందు 2000 సంవత్సరంలో జాతర సందర్భంగా భక్తులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారని స్థానికుల ద్వారా తెలుసుకున్నాను. ఆ ఇబ్బందులు ఇకపై ఉండొద్దని భావించాను. ఇందుకోసం మేడారం, కన్నెపల్లి, రెడ్డిగూడెం, ఊరట్టం, కొత్తూరుల్లో ఐటీడీఏ నిధులతో రహదారి విస్తరణ పనులు చేరుుంచాను. రెడ్డిగూడెం గ్రామస్తులు పనులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారిని తాడ్వాయి పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించాను. రోడ్లు వేరుుంచాను. ప్రజా సంక్షేమం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో తప్పు లేదు. కన్నెపల్లి, పూనుగొండ్ల, కొండాయిలలో వనదేవతల ఆలయాల అభివృద్ధికి తోడ్పడ్డాను.
Advertisement
Advertisement