మెట్టలో పంటను కాపాడాలి
మెట్టలో పంటను కాపాడాలి
Published Mon, Aug 22 2016 11:53 PM | Last Updated on Thu, Mar 21 2019 8:18 PM
కలెక్టర్ అరుణ్‌కుమార్
కాకినాడ సిటీ :
జిల్లాలోని మెట్ట ప్రాంతంలో వర్షాభావ పరిస్ధితుల నుంచి పంటను కాపాడుకోవడానికి పిఠాపురం బ్రాంచ్ కెనాల్, ఏలేరు కాల్వల రైతులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అరుణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పీబీసీ, ఏలేరు కాలువల పరిధిలోని రైతులకు ఆయిల్ ఇంజన్లు ఏర్పాటు చేయాలని, కాలువలలో అనధికార నీటి వినియోగాన్ని అరికట్టాలని వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. ఏలేరు కాల్వ పరిధిలో పంటలు వేయని 10వేల ఎకరాలకు అపరాల విత్తనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రెయిన్‌గన్స్ వినియోగం కూడా ప్రోత్సహించాలని సూచించారు. వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల కొనుగోలులో రైతులకు స్వేచ్ఛను ఇవ్వాలన్నారు. జిల్లాలో తలపెట్టిన 15వేల వర్మికంపోస్ట్ యూనిట్ల ఏర్పాటును వేగవంతం చేయాలని, వీటి ద్వారా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన న్యూట్రీ గార్డెన్స్‌కు కూడా సేంద్రియ ఎరువుల పంపిణీ చేయవచ్చన్నారు.
కోనో కార్పస్ మొక్కలు పెంచండి
జిల్లాలో సామాజిక వన విభాగం ద్వారా ఎక్కువ నీడ నిచ్చే కోనో కార్పస్ (దుబాయ్‌ప్లాంట్) మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించాలని కలెక్టర్ అటవీశాఖ అధికారులకు సూచించారు. ఈ మొక్కలను తొలివిడతగా 50వేల నుంచి లక్ష వరకు పెంచాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్–2 రాధాకృష్ణ మూర్తి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Advertisement