కలెక్టరేట్‌కు మరమ్మతులు చేపట్టండి
కలెక్టరేట్‌కు మరమ్మతులు చేపట్టండి
Published Sat, Oct 29 2016 7:38 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
- జిల్లా కలెక్టర్ విజయమోహన్
కర్నూలు(అగ్రికల్చర్): కలెక్టరేట్‌కు మరమ్మతులు చేపట్టాలని ఆర్‌అండ్‌బీ అధికారులను జిల్లా కలెక్టర్ విజయమోహన్ ఆదేశించారు. శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా పరిశుభ్రత కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ స్థితిగతులను పరిశీలించారు. దెబ్బతిన్న భవనాలకు మరమ్మతులు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. మరమ్మతులు వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ గంగాధర్‌గగౌడు, సీపీఓ ఆనంద్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement