కలెక్టరేట్ ప్రాంగణంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
కాకినాడ సిటీ :
కలెక్టర్ అరుణ్‌కుమార్ శుక్రవారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ల్యాండ్ రిఫార్మ్‌స్ విభాగంతో పాటు ఆధార్ సెంటర్లను, కలెక్టరేట్ ఆవరణంలో కలియదిరిగారు. సిబ్బందికి సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్ ప్రాంగణంలో పాత వాహనాలను తొలగించి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, అక్షరగోదావరి కార్యాలయం పరిసర ప్రాంతంలో వాహనాల పార్కింగ్ సౌకర్యం కల్పించాలని, అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్ వైర్లను సరిచేయాలని, నీటిపైపులైన్ లీకేజీలను అరికట్టాలని ఆదేశించారు. అలాగే పౌరసరఫరాల శాఖ కార్యాలయం భవన్‌లో ఉన్న ఆధార్ సెంటర్ పనితీరును పరిశీలించి అక్కడ అదనపు సౌకర్యాలు కల్పించాలని సూచించారు.