సీఎం పర్యటన ఏరాట్ల పరిశీలన
సీఎం పర్యటన ఏరాట్ల పరిశీలన
Published Mon, Jun 5 2017 10:58 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
కాకినాడ సిటీ : నవనిర్మాణ దీక్ష మహా సంకల్పంలో పాల్గొనేందుకు ఈనెల 8న కాకినాడ వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించే ప్రాంతాల్లో ఏర్పాట్లను ఎస్పీ ఎం.రవిప్రకాష్‌తో కలిసి కలెక్టర్ కార్తికేయమిశ్రా సోమవారం పరిశీలించారు. సీఎం హెలికాప్టర్ దిగే కాకినాడలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లోని హెలిప్యాడ్‌ను కలెక్టర్ పరిశీలించారు. అక్కడ అవసరమైన బందోబస్తు , ముఖ్యమంత్రి స్వాగతం పలికే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. హెలిప్యాడ్ నుంచి కాకినాడలోని ఆనంద భారతి గ్రౌండ్స్ వరకూ సీఎం పర్యటించే ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ఆనందభారతి మైదానంలోని సీఎం సభాస్థలి, ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసే ప్రాంతాలు, బహిరంగ సభ, వీఐపీ పార్కింగ్ తదితర అంశాలపై ఆయా ఏర్పాట్లు చూసే అధికారులకు కలెక్టర్ తగు సూచనలు ఇచ్చారు. హాజరయ్యే వారంతా సభా ప్రాంగణంలో నిర్ణీత పద్ధతి పాటించేలా చూడాలని ఆయన సూచించారు. కలెక్టర్ వెంట అసిస్టెంట్ కలెక్టర్ ఆనంద్, ట్రైనీ ఎస్పీ వి.అజిత్, ఆర్ అండ్ బీ ఎస్‌ఈ సీఎస్‌ఎన్ మూర్తి, మున్సిపల్ కార్పొరేషన్ ఎస్‌ఈ సీహెచ్ విజయకుమార్, కాకినాడ ఆర్డీఓ ఎల్.రఘుబాబు ఉన్నారు.
Advertisement