రోగులకు మెరుగైన సేవలు అందించాలి
-
ఆస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ నీతూప్రసాద్
కరీంనగర్ హెల్త్: నగరంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రిని కలెక్టర్ నీతూప్రసాద్ బుధవారం ఆకస్మికంగా తనిఖీచేశారు. ఆస్పత్రిలోని పిల్లలవార్డులో జరుగుతున్న మరమ్మతు పనులు పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆస్పత్రిలోని మెటర్నిటివార్డు, క్యాంటీన్ కిచన్ గదులు, ఉద్యోగ సంఘం కార్యాలయాన్ని వేరే గదుల్లోకి మార్చి అక్కడ 30పకడల వార్డును నిర్మించాలని ఆదేశించారు. ఆస్పత్రి ఆవరణలో అదనపు బెడ్లలో సేవలు పొందుతున్న రోగులను వైద్య సేవల గురించి అడిగితెలుసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాల కారణంగా రక్తంలో ప్లేట్‌లేట్స్ తగ్గిపోయి ఆస్పత్రిలో చేరుతున్న వారికి అవసరమైన రక్తాన్ని అందించాలన్నారు. డీఎంహెచ్‌వో రాజేశం, డీసీహెచ్‌ఎస్ అశోక్‌కుమార్ ఉన్నారు.