టీఆర్ఎస్కు డీకే అరుణ ప్రతిపాదన
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో, టీఆర్ఎస్ ఏకగ్రీవ ప్రతిపాదనకు అంగీకరిస్తే ఆహ్వానిస్తామని గద్వాల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ తెలిపారు. సోమవారం గాంధీభవన్లో మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ నేతల భేటీ జరిగింది.
ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ ...పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉందని..టీడీపీ, బీజేపీ కూటమికి ఒక్క సీటు గెలుచుకునే బలం లేదని ఎద్దేవా చేశారు. మహబూబ్నగర్ జిల్లాలో రెండు స్ధానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ చెరో సీటు గెలిచేందుకు సహకరిస్తే ఆహ్వానిస్తామని డీకే అరుణ అన్నారు.
తెలంగాణలో హైదరాబాద్ మినహా 9 జిల్లాల్లో మొత్తం 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు డిసెంబర్ 27న పోలింగ్, 30వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘంఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది.