గిరిజనుల గోడు పట్టదా!
గిరిజనుల గోడు పట్టదా!
Published Fri, Jan 13 2017 9:40 PM | Last Updated on Tue, Sep 5 2017 1:11 AM
- రాష్ట్ర ప్రభుత్వంపై గిరిజన నేతలు ఆగ్రహం
– సమస్యలు పరిష్కరించాలని ఐక్య గిరిజన సంఘాల ఆధ్వర్యంలో నిరవధిక నిరాహారదీక్ష
కర్నూలు(న్యూసిటీ): ‘ఏళ్లు గడుస్తున్న గిరిజనులు అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఆర్థికంగా,రాజకీయంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నారు.పట్టించుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుంద’ని ఐక్య గిరిజన సంఘాల నాయకులు మండిపడ్డారు. గిరిజనులు సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం కర్నూలు నగరంలోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహం సర్కిల్‌లో ఆ సంఘాల ఆధ్వర్యంలో 48 గంటల నిరవధిక నిరాహారదీక్ష చేపట్టారు. సామాజిక హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ కె.జగన్నాథం, సీపీఐ జిల్లా కార్యదర్శి రామాంజనేయులు, మాజీకార్పొరేటర్ జి.వెంకటస్వామి ఈ దీక్షను ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిపుత్రులపై వివక్ష చూపడం తగదన్నారు.
ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు చంద్రప్ప మాట్లాడుతూ గిరిజనులు తండాల్లో, గూడేల్లో నివసిస్తూ అర్ధాకలితో అలమటిస్తున్నారన్నారు. పుండుమీద కారం చల్లినట్లు ఇతర కులాలను గిరిజన జాబితాలో చేర్చుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం బాధాకరమన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు తమను బలి చేసినా, కులాల మధ్య గొడవ పెట్టినా సహించమని, రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. దీక్షలో ఆర్‌పీ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవిందు, జిల్లా కార్యదర్శి రాముడు, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కైలాస్‌నాయక్, జిల్లా అధ్యక్షుడు గుండాలనాయక్, ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ఆర్.చంద్రప్ప, జిల్లా కార్యదర్శి పి.వెంకటేష్, ఏఐబీఎస్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరమణ నాయక్, వైహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు రాముడు, జిల్లా కార్యదర్శి నాగరాజు, ఆలిండియా ఎరుకల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.శ్రీరాములు, కృష్ణ దీక్షల్లో కూర్చున్నారు.
పలువురు మద్దతు
దీక్షలో కూర్చున్న వారికి విభిన్న ప్రతిభావంతుల ఉద్యోగ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రమేష్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిప్పేనాయక్, సర్వేశాఖ ఏడీ చెన్నయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి రామాంజనేయులు, సీపీఐ నాయకులు శేఖర్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మునెప్ప, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రంగన్న, మార్కెట్‌యార్డు డైరక్టర్ కె.నారాయణ, వైఎస్‌ఆర్ కడప జిల్లా అధ్యక్షుడు జి.వెంకటశివ తదితరులు సంఘీభావం తెలిపారు.
Advertisement