చావులోనూ వీడని బంధం | couple dies in an hour | Sakshi
Sakshi News home page

చావులోనూ వీడని బంధం

Published Fri, Mar 3 2017 10:27 PM | Last Updated on Wed, Jul 10 2019 7:55 PM

చావులోనూ వీడని బంధం - Sakshi

చావులోనూ వీడని బంధం

గంటల వ్యవధిలో దంపతుల మృతి
బెళుగుప్ప (ఉరవకొండ) : మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన ఆ దంపతులు చావులోనూ కలిసే వెళ్లారు. బెళుగుప్ప తండాకు చెందిన లాల్‌సింగ్‌నాయక్‌(68), నీలమ్మబాయి(64) దంపతులు. అన్యోన్యంగా ఉన్న ఈ వృద్ధ దంపతులలో లాల్‌సింగ్‌నాయక్‌ మూడు రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. పక్షవాతం కూడా సోకింది. భర్త జబ్బుబారిన పడటంతో భార్య నీలమ్మబాయి గుండె తట్టుకోలేకపోయింది. ఛాతీలో నొప్పి రావడంతో ఆమెను అదే రోజు రాత్రి అనంతపురంలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు.

శుక్రవారం ఉదయం లాల్‌సింగ్‌నాయక్‌ ఇంటిలోనే కన్నుమూశాడు. భార్యకు సమాచారం అందించి స్వగ్రామానికి జీపులో తీసుకొస్తుండగా మార్గమధ్యంలోనే 10 గంటల సమయంలో ఆమె కూడా ప్రాణాలు విడిచింది. భార్యాభర్తలు గంటల వ్యవధిలో మృతి చెందడంతో ఇద్దరి మృతదేహాలను ఒకేచోట ఒకే గుంతలోనే ఖననం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement