చంద్రబాబు దిగజారిపోయారు: కె.రామకృష్ణ | CPI leader criticized Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు దిగజారిపోయారు: కె.రామకృష్ణ

Published Sun, Mar 6 2016 7:31 PM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

CPI leader criticized Chandrababu Naidu

చంద్రబాబు తాను చెప్పిన మాట మీద నిలబడలేనంతగా దిగజారిపోయారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. సైకిల్ గుర్తుపై గెలిచి వేరే పార్టీలో చేరిన వారిని ఓడించాలని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పిలుపునిచ్చిన చంద్రబాబు... పది రోజులు కూడా గడవకముందే రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం దిగజారుదుతనానికి నిదర్శనమన్నారు.

ఆదివారం ఆయన అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు. అమరావతి నిర్మాణంలో ఒక్క ఇటుక కూడా పేర్చకముందే వేల కోట్ల రూల భూ కుంభకోణం బయటపడిందన్నారు. దాన్ని సీఎం స్థాయిలో ఉండి చంద్రబాబు సమర్థించడం సిగ్గు చేటన్నారు. చంద్రబాబుకు రాయలసీమ అభివృద్ధి కానీ, ఇక్కడి కరువు, ఆత్మహత్యలు గానీ పట్టడం లేదని విమర్శించారు. రాయలసీమ అభివృద్ధి కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అసెంబ్లీ ముట్టడిస్తామన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement