'కోట్లు, కోటలు, కేసులతో సీఎం బిజీ' | CPI leader Narayan criticized the chief minister | Sakshi
Sakshi News home page

'కోట్లు, కోటలు, కేసులతో సీఎం బిజీ'

Published Thu, Dec 3 2015 11:49 AM | Last Updated on Mon, Aug 13 2018 3:58 PM

CPI leader Narayan criticized the chief minister

కోట్లు, కోటలు, కేసులతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీగా మారిపోయారని.. ప్రభుత్వ ఖజానా లూటీ అవుతున్నా పట్టించుకునే స్థితిలో లేరని సీపీఐ జాతీయ నేత నారాయణ విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేయడం లేదన్నారు.

అభివృద్ధి కుంటు పడిందని పేర్కొన్నారు. కేసుల్లోంచి బయట పడేందుకే.. ప్రత్యేక హోదాపై కేంద్రం వద్ద మెతక వైఖరి అవలంబిస్తున్నారని.. ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ తో డిసెంబర్ 7న సీపీఐ భారీ స్థాయిలో ధర్నా నిర్వహించనున్నట్లు తెలియజేశారు. తమ ధర్నా కార్యక్రమానికి తెలుగు ప్రజలు మద్దతు తెలపాలని కోరారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement