తక్కడపల్లి శివారులో పత్తి పంట సాగు
పంట ఎదుగుదలకు విరివిగా ఎరువులు
మునిపల్లి: సింగూరు ప్రాజెక్టులో ముంపునకు గురయ్యే సాగు భూముల్లో రైతులు పత్తి పంట వేశారు. పంట ఎదుగుదల కోసం వివిధ రకాల ఎరువులను వేశారు. సరిపడా ఎరువులు వేయాల్సి ఉండగా మోతాదుకు మించి వేస్తున్నారు. పంట తొందరగా ఎదగాలనే ఉద్దేశంతో రైతులు పత్తి పంటలో ఎరవులను అధికంగా వేస్తున్నారు.
చీలపల్లి, మక్తకాసారం, కల్లపల్లి బెలూర్, పిల్లోడి, బోడపల్లి, తక్కడపల్లి, మల్లికార్జునపల్లి గ్రామాల రైతులు సింగూరు ప్రాజెక్టులో ముంపునకు గురయ్యే భూములను దుక్కి దున్ని పత్తి పంట సాగు చేస్తున్నారు. వర్షాలు ఎక్కువగా కురిస్తే భూములు నీట మునుగుతాయని రైతులు భయపడి ఇప్పటి వరకు పంటలు వేయలేదు.
ప్రస్తుతం ధైర్యం చేసి సాగుకు సమాయత్తమయ్యారు. ఇదిలా ఉంటే పత్తి ఆలస్యంగా విత్తడంతో పంట ఎదుగుదల అంతంతే ఉంది. దీంతో పంట ఎదుగుదల కోసం ఎక్కువ మొత్తంలో ఎరువులను వాడుతున్నారు. ఎకరా పత్తి పంటలో సుమారు 2 బస్తాల యురియా, 2 బస్తాల డీఎపీ కలిపి పత్తి పంటలో చల్లారు.