- వర్గీకరణ డిమాండ్‌తో నవంబర్ 18న బహిరంగ సభ
- పాదయాత్రలో ఎమ్మార్పీఎస్(టీఎస్) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ‘వంగపల్లి’
తెలంగాణ మాదిరే డప్పు, చెప్పు ఉద్యమం
Published Wed, Oct 5 2016 1:26 AM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM
మహబూబాబాద్ : తెలంగాణ ఉద్యమం ఎంత న్యాయమైనదో.. డప్పు, చెప్పు ఉద్య మం కూడా అంతే న్యాయమైనదని ఎమ్మార్పీఎస్(టీఎస్) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. వర్గీకరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలన్న డిమాండ్‌తో శ్రీనివాస్ చేపట్టిన పాదయాత్ర మంగళవారం రాత్రి మానుకోటకు చేరుకుం ది. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఆ యనకు ఘన స్వాగతం పలికారు. అనంత రం నెహ్రూ సెంటర్‌లో వంగపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు పార్లమెం ట్‌లో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశా రు. సీఎం కేసీఆర్‌కు దళితుల పట్ల ఏ మా త్రం చిత్తశుద్ధి ఉన్నా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి, ఆ బిల్లుపై ఎంపీలు మాట్లాడే లా కృషి చేయాలన్నారు. పాదయాత్ర నవంబర్ 18న హైదరాబాద్ చేరుకుంటుందని, అదేరోజు భారీ బహిరంగ సభ ఏర్పాటుచేస్తామని పేర్కొన్నారు. అయినా ప్రభుత్వం స్పందించకపోతే 19న హైదరాబాద్‌ను దిగ్బందిస్తామని శ్రీనివాస్ హెచ్చరించారు.
వీరభద్రస్వామి ఆలయంలో పూజలు
కురవి : ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం కో సం పాదయాత్ర చేపట్టిన వంగపల్లి శ్రీని వాస్ కురవిలోని శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. పాదయా త్ర కురవికి చేరుకున్న సందర్భంగా ఆయన పూజలు నిర్వహించడంతో పాటు సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. మేకల నరేందర్, కె.ఎల్లయ్య, సంజీవ, వెంకన్న, సునీల్, వెంకన్న, రుక్క మ్మ, టి.ప్రవీణ్, వెంకన్న పాల్గొన్నారు.
Advertisement
Advertisement