Vangapally srinivas
-
దళితబంధులో సామాజిక న్యాయం పాటించాలి
మెదక్‌జోన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకంలో సామాజిక న్యా యం పాటించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం ప్రభుత్వ అతిథి గృహంలో సోమవారం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన వంగపల్లి మాట్లాడుతూ.. రాష్ట్ర జనాభాలో 22శాతం ఉన్న మాదిగలకు మొదట ప్రాధాన్యం ఇవ్వా లన్నారు. జనాభా దామాషా ప్రకారమే లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మాదిగలు అలుపెరుగని పోరాటం చేశారని గుర్తుచేశారు. డప్పు దరువు, గూటం దెబ్బతో ఉద్యమాన్ని ఉధృతం చేసి, కేంద్రం మెడలు వంచిన ఘనత మాదిగలకు ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు ప్రభాకర్, జాతీయ కార్యదర్శి యాదగిరి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామచంద్రం పాల్గొన్నారు. -
దళితుల శాశ్వత శత్రువు బీజేపీ
మహబూబ్‌నగర్ రూరల్: మనువాద, బ్రాహ్మణ సిద్ధాంతాలతో దళిత, అణగారిన వర్గాలను విద్య, ఉపాధి, రాజకీయ, ఆర్థిక రంగాలకు దూరం చేస్తున్న బీజేపీయే తమ శాశ్వత శత్రువని ఎమ్మార్పీఎస్ (టీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం రెడ్‌క్రాస్ భవనంలో సంఘం మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థాయి సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళిత, అణగారిన వర్గాల ప్రజలపై దాడులు నిత్యకృత్యమయ్యాయని ఆరోపించారు. విద్వేషాలతో మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ఆకృత్యాలకు పాల్పడుతోందని విమర్శించారు. అంతకుముందు తెలంగాణ చౌరస్తా నుంచి కార్యకర్తలు ర్యాలీగా అంబేడ్కర్ చౌరస్తా వరకు చేరుకున్నారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, కార్యదర్శి మైబన్న, జిల్లా గౌరవాధ్యక్షుడు వెంకటయ్య పాల్గొన్నారు. -
దళిత శక్తి రాజకీయ శక్తిగా మారాలి
సాక్షి, హైదరాబాద్ : దళిత శక్తి రాజకీయ శక్తిగా మారి బీసీ వర్గాలను కలుపుకుని రాబోయే రోజుల్లో అధికారం చేపట్టాలని ప్రజా గాయకుడు గద్దర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పేదల బతుకులు మారాలంటే విద్య, వైద్యం ఉచితంగా అందచేయాలన్నారు. జనం వీటి కోసమే రూ.కోట్లు ఖర్చుపెడుతున్నారన్నారు. ఉద్యోగాలు చేసే వారు కూడా తమ పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. సోషల్ వెల్ఫేర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ టీఎమ్మార్పీఎస్ వర్కింగ్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 25న ఖమ్మం జిల్లా నుంచి చేపట్టిన సైకిల్ యాత్ర ముగింపు బహిరంగ సభ గురువారం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగింది. ఇందులో గద్దర్ మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తర్వాత మాదిగ ఉప కులాల బతుకులు మారలేదని, వారి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. ‘‘దళితులకు మూడెకరాల భూమి ఇవ్వనందుకు డబ్బు బ్యాంక్‌లో జమ చేయాలి. డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టి ఇవ్వనందుకు వాటి కిరాయిలను ప్రభుత్వమే బ్యాంక్ అకౌంట్లో వేయాలి. మాల మాదిగలు కలసి ఉండాలి. ఇరువర్గాల మధ్య నేను వారధిగా ఉంటా. దళితులంతా ఐక్య రాజకీయ శక్తిగా మారాలి’’అని అన్నారు. రాబోయే సర్పంచ్, సార్వత్రిక ఎన్నికల్లో పల్లెల్లోకి వెళ్లి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు. అక్షరంతోనే జాతి మనుగడ అణగారిన బతుకులు మారాలని, మాదిగ ఉప కులాలను అక్షర చైతన్యం వైపు నడిపించాలన్న బాధ్యతతో సైకిల్ యాత్ర చేపట్టినట్లు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. అక్షరాలే జాతి మనుగడకు మూలమని, బతుకులు మారాలంటే విద్య వైపు మళ్లాలని అన్నారు. దళిత వర్గాలు అభివృద్ధి చెందాలన్నా, చదువుల్లో రాణించాలన్నా ప్రత్యేక సోషల్ వెల్ఫేర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రంలో మాదిరే ప్రత్యేక రాష్ట్రంలోనూ దళితుల పరిస్థితి మారలేదని పేర్కొన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీల వల్ల పేద విద్యార్థులు చదువుకునే హక్కు కోల్పోతారని, ఆ యూనివర్సిటీలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సీలపై సమగ్ర సర్వే జరిపించాలని, డప్పుకు, చెప్పుకు రూ.2 వేల పింఛన్ ఇవ్వాలని, ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని, దళితులకు మూడెకరాల భూమి ఇవ్వాలన్నారు. తమ సమస్యలు పరిష్కరిస్తేనే బంగారు తెలంగాణలో భాగస్వాములవుతామని, లేదంటే వచ్చే ఎన్నికల్లో ఓటు చైతన్యంతో రాజకీయ శక్తిగా సత్తా చాటుతామని చెప్పారు. పేద వర్గాలకు చదువును దూరం చేసేందుకే ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహిస్తోందని ఎమ్మార్పీస్ రాష్ట్ర అధ్యక్షుడు యాతాకుల భాస్కర్ ఆరోపించారు. త్వరలోనే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో దళితుల రాజ్యాంగ అధికార బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మార్పీస్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేడి పాపయ్య మాట్లాడుతూ.. సీఎం గతంలో డప్పుకు, చెప్పుకు రూ.2 వేల పెన్షన్ ఇస్తామని చెప్పినా ఇంత వరకు దాని ఊసే లేదన్నారు. సభలో మోచి సంఘం రాష్ట్ర నాయకులు డా.రాజమౌళిచారి, చింతల మల్లికార్జున్ గౌడ్, బెడగ సంఘం నేతలు చింతల మల్లికార్జున్, సండ్ర వెంకటయ్య, హోళియ, దాసరి నాయకులు వీరేశం, హనుమంతు, సంఘం మహిళ విభాగం జాతీయ అధ్యక్షులు అందె రుక్కమ్మ, రాష్ట్ర అధ్యక్షులు పిడుగు మంజుల, మామిడి రాంచందర్, జి.డి.నర్సింహ, కొల్లూరి వెంకట్, చందు, కొంగరి శంకర్, అశోక్, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. -
దళితులపై సీఎం ప్రేమ చూపాలి
గీసుకొండ : సీఎం కేసీఆర్ బతుకమ్మపై ప్రేమ చూపిస్తున్నట్లుగానేదళితుల సంక్షేమంపై కూడా అంతే చూపాలని ఎమ్మార్పీఎస్ టీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్ మాదిగ అన్నారు. బతుకమ్మ పండుగకు రూ.15 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం దళితుల సంక్షేమం కోసం అదే రీతిలోనిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. మాదిగ చైతన్య పాదయాత్ర పేరుతో ఆయన చేపట్టిన పాదయాత్ర శనివారం మండలానికి చేరుకున్న సందర్బంగా ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ జనగామ, సిరిసిల్ల, గద్వాల జిల్లాల కోసం రెం డు నెలలు అక్క డి ప్రజలు పోరాటం చేస్తే వారంతా సంతోషంగా ఉండాలంటూ ప్రత్యేక జిల్లాలుగా ప్రకటిం చారన్నా రు. అదే తరహాలో తాము ఏడాదిగా వర్గీకరణ కోసం ఉద్యమిస్తుంటే పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ ఉద్యమం లో మాదిగలు ముఖ్య భూమిక పోషించారనేది పలు జాతీ య సర్వేల్లో వెల్లడైందని,ఆ ఉద్యమం ఎలా న్యాయమైందో, డప్పు, చెప్పు ఉద్యమం కూడా అంతే న్యాయమైందన్నారు. నవంబర్ 19 వరకు పాదయాత్ర కొనసాగుతుందని, సీఎం కేసీఆర్ మాదిగలకు ఇచ్చిన మాట నిలుపుకోవాలన్నారు. పాదయాత్ర 21వ రోజున 840 కిలోమీటర్ల కు చేరింది. సం గెం మండలం ఊకల్ హవేలి, మరియపురం, కొనాయమాకుల, ధర్మారం మీదుగా నగరంలోకి ప్రవేశిం చింది. మధ్య లో ధర్మారం వద్ద అంబేద్కర్ విగ్రహానికి శ్రీని వాస్ మాదిగ పూలమాల వేసి నివాళులర్పించారు. పాదయాత్రలో ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు శిలువేరు సాంబయ్యమాదిగ, జిల్లా ఇన్చార్జి మేకల నరేందర్, ప్రధాన కార్యదర్శి సంజీవ, సహాయ కార్యదర్శి మంద బాబూరావు, ఉపాధ్యక్షులు మా దాసి రాంబాబు, రమేశ్, అర్బన్అధ్యక్షులుఆకులపెల్లి బాబు, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు రుక్కక్క, పరకాలని యోజకవర్గ ఇన్చార్జి మెట్‌పెల్లి కొంరన్న, రవి, యువసేన జిల్లా అధ్యక్షుడు విజయ్, దళిత ఫోరం స్టేట్ కన్వీనర్ డాక్టర్ పులి అనీల్, బుచ్చన్న, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. -
తెలంగాణ మాదిరే డప్పు, చెప్పు ఉద్యమం
వర్గీకరణ డిమాండ్‌తో నవంబర్ 18న బహిరంగ సభ పాదయాత్రలో ఎమ్మార్పీఎస్(టీఎస్) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ‘వంగపల్లి’ మహబూబాబాద్ : తెలంగాణ ఉద్యమం ఎంత న్యాయమైనదో.. డప్పు, చెప్పు ఉద్య మం కూడా అంతే న్యాయమైనదని ఎమ్మార్పీఎస్(టీఎస్) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలన్న డిమాండ్‌తో శ్రీనివాస్ చేపట్టిన పాదయాత్ర మంగళవారం రాత్రి మానుకోటకు చేరుకుం ది. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఆ యనకు ఘన స్వాగతం పలికారు. అనంత రం నెహ్రూ సెంటర్లో వంగపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు పార్లమెం ట్లో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశా రు. సీఎం కేసీఆర్‌కు దళితుల పట్ల ఏ మా త్రం చిత్తశుద్ధి ఉన్నా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి, ఆ బిల్లుపై ఎంపీలు మాట్లాడే లా కృషి చేయాలన్నారు. పాదయాత్ర నవంబర్ 18న హైదరాబాద్ చేరుకుంటుందని, అదేరోజు భారీ బహిరంగ సభ ఏర్పాటుచేస్తామని పేర్కొన్నారు. అయినా ప్రభుత్వం స్పందించకపోతే 19న హైదరాబాద్‌ను దిగ్బందిస్తామని శ్రీనివాస్ హెచ్చరించారు. వీరభద్రస్వామి ఆలయంలో పూజలు కురవి : ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం కో సం పాదయాత్ర చేపట్టిన వంగపల్లి శ్రీని వాస్ కురవిలోని శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. పాదయా త్ర కురవికి చేరుకున్న సందర్భంగా ఆయన పూజలు నిర్వహించడంతో పాటు సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. మేకల నరేందర్, కె.ఎల్లయ్య, సంజీవ, వెంకన్న, సునీల్, వెంకన్న, రుక్క మ్మ, టి.ప్రవీణ్, వెంకన్న పాల్గొన్నారు. -
'కుటుంబం కోసం జాతిని అమ్ముకున్నారు'
మంద కృష్ణపై వంగపల్లి ధ్వజం హైదరాబాద్: కుటుంబం కోసం మాదిగ జాతిని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణమాదిగ అమ్ముకున్నారని ఎంఎస్ఎఫ్-టీఎస్ రాష్ట్ర కోఆర్డినేటర్ వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఆరోపించారు. శుక్రవారం ఓయూ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పక్కనపెట్టి మాదిగలను మోసం చేసిన చంద్రబాబును ఏపీలో తిరగనీయమని ప్రగల్బాలు పలికిన మందకృష్ణ.. హైదరాబాద్‌లో టీడీపీ మహానాడు జరుగుతుంటే ఎందుకు నోరు విప్పలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. మందకృష్ణ తన కూతురుకు మెడిసిన్‌లో పీజీ సీటు కోసం రూ. 1.50 కోట్లకు ఉద్యమాన్ని తాకట్టు పెట్టాడని పేర్కొన్నారు. సమావేశంలో అలెగ్జాండర్, నగేశ్, కొంగరి శంకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మార్పీఎస్ నేతపై హత్యాయత్నం
* జడ్చర్ల సమీపంలో వంగపల్లి వాహనం అడ్డగింత * కర్రలు, రాళ్లతో దాడి, పెట్రోలు పోసి నిప్పంటించే యత్నం * డ్రైవర్‌కు గాయాలు, తృటిలో తప్పించుకున్న వంగపల్లి * ఇది మందకృష్ణ పనే అని ఆరోపణ జడ్చర్ల: తెలంగాణ రాష్ట్ర ఎమ్మార్పీఎస్ కో-ఆర్డినేటర్ వంగపల్లి శ్రీనివాస్‌పై హత్యాయత్నం జరిగింది. ఆయన వాహనాన్ని అడ్డగించిన కొందరు దుండగులు.. ఒక్కసారిగా కర్రలు, రాళ్లతో దాడి చేసి వాహనం అద్దాలు ధ్వంసం చేశారు. పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు యత్నిం చగా.. తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటన లో కారు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో శుక్రవారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్‌లోని అంబేద్కర్ కళాభవన్‌లో జరిగిన ఎంఎస్ఎఫ్ జిల్లా సమావేశానికి వంగపల్లి శ్రీనివాస్‌తో సహా రాజు, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు మంజుల హాజరయ్యారు. సాయంత్రం ఏడు గంటలకు తమ వాహనంలో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలోని జడ్చర్ల హౌసింగ్‌బోర్డు సమీపంలోకి వచ్చేసరికి గుర్తుతెలియని వ్యక్తులు వాహనాన్ని అడ్డగించారు. కర్రలు, రాళ్లతో దాడి చేశారు. దీంతో డ్రైవర్ జైపాల్‌రెడ్డికి గాయాలయ్యాయి. ముందు సీటులో వున్న రాజుపై పెట్రోలు పోశారు. ప్ర మాదాన్ని పసిగట్టి వారంతా తృటిలో తప్పించుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని సీఐ జంగయ్యకు ఫిర్యాదు చేశారు. తమపై దాడి చేయించింది ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగేనని వంగపల్లి శ్రీని వాస్ ఆరోపించారు. జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు జంగయ్య, కోళ్ల వెంకటేశ్ తదితరులపై ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.