- బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన ఎమ్మార్పీఎస్ నాయకులు
తక్షణమే ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలి
Published Thu, Jul 21 2016 12:21 AM | Last Updated on Fri, Mar 29 2019 5:57 PM
హన్మకొండ : ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని ఎమ్మార్పీఎస్ (టీఎస్) జిల్లా అధ్యక్షుడు సిలువేరు సాంబ య్య మాది గ డిమాండ్ చేశారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరు తూ నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయాన్ని బుధవారం ముట్టడించారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సాంబయ్య మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ కు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన బీజేపీ.. రెండేళ్లు గడిచినా పట్టించుకోవడం లేదన్నారు. దీంతో మాదిగ, మాదిగ ఉపకులాలకు అన్యా యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అంశా న్ని బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళతానన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కొత్త దశరథం, ఎమ్మార్పీఎస్ (టీఎస్) యువతజిల్లాఅధ్యక్షుడు తాళ్లపల్లి విజయ్, డాక్టర్స్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ రామకృష్ణ, నాయకులు అనిల్‌కుమార్, దైద డేవిడ్, మాదాసు రాంబాబు, సంజీవ, మంద బాబురావు, కిశోర్, బాలయ్య, ఇల్లందుల రాజేష్‌ఖన్నా పాల్గొన్నారు.
Advertisement
Advertisement