గుండెపోటుతో హోల్‌సేల్ వ్యాపారి మృతి
-
వసూళ్ల కోసం హైదరాబాద్ నుంచి రాక
-
lభార్య ఫోన్‌తో లాడ్జి గది నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న బంధువులు
-
lరూ.2,72,710 సొమ్ము లభ్యం
రాజమహేంద్రవరం క్రైం :
స్థానిక త్రీ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో హైదరాబాద్‌కు చెందిన ప్లాస్టిక్ హోల్‌సేల్ వ్యాపారి గుండెపోటుతో మృతి చెందారు. సీఐ శ్రీరామ కోటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ రాజేంద్రనగర్‌కు చెందిన వ్యాపారి బీకే బన్సలి (62) రాజమహేంద్రవరంలో కొందరు వ్యాపారులకు ప్లాస్టిక్ వస్తువులు సరఫరా చేస్తుంటారు. వారి నుంచి నగదు వసూలు చేసుకునే నిమిత్తం మంగళవారం రాజమహేంద్రవరం చేరుకొని నల్లమందు సందులో ఉన్న గణేష్ రెసిడెన్సీలో ఒక రూమ్ అద్దెకు తీసుకున్నారు. కొందరి వద్ద నుంచి నగదు వసూలు చేసుకుని రాత్రి లాడ్జికి తిరిగి వచ్చి నిద్రపోయారు. నిద్రలోనే గుండె పోటు రావడంతో మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. బన్సలి భార్య ఉదయం ఫో¯ŒS చేయగా ఎంతకీ తీయకపోవడంతో రాజమహేంద్రవరంలో ఉన్న తమ బంధువులకు సమాచారం అందించారు. వారు హోటల్‌కు వెళ్లి రూమ్ తలుపులు తెరిచే సరికి మంచంపై నిర్జీవంగా పడి ఉన్నాడు. అతని వద్ద రూ 2,72,710లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నగదు, ఇతర వస్తువులు ఉండడం, డోర్ లాక్ వేసి ఉండడం వల్ల గుండెపోటు వచ్చి మృతి చెం ది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజ మహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిం చారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.