7 నుంచి డీఈఈసెట్ సర్టిఫికెట్ల పరిశీలన
Published Fri, Aug 5 2016 10:15 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM
బొమ్మూరు (రాజమహేంద్రవరం రూరల్) :
ఏపీ డీఈఈసెట్–2016లో అర్హులైన అభ్యర్థులకు వారికి కేటాయించిన ప్రభుత్వ డైట్ కళాశాలల్లో ఈ నెల ఏడు నుంచి సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్) ప్రిన్సిపాల్ అప్పారి జయప్రకాశరావు శుక్రవారం విలేకర్లకు తెలిపారు. డీఈఈసెట్‌లో అర్హులైన అభ్యర్థులు తమకు నచ్చిన డైట్, ప్రభుత్వ, ప్రైవేటు డీఎడ్ కళాశాలలకు ఆప్షన్లు ఇచ్చారన్నారు. వెబ్ కౌన్సెలింగ్‌లో సీటు పొందినవారు ఈ నెల ఆరో తేదీన ఎలాట్‌మెంట్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. తమకు ఏ కళాశాలలో, ఏ జిల్లాలో సీటు వచ్చిందో, ఏ ప్రభుత్వ డైట్ కళాశాలకు వెళ్లాలో క్షుణ్ణంగా చదువుకోవాలన్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు నిర్దేశిత తేదీల్లో ప్రభుత్వ డైట్ కళాశాలకు వెళ్లాలన్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చే అభ్యర్థులు అలాట్‌మెంట్ లెటర్‌తోపాటు, ఆన్‌లైన్‌లో పెట్టిన అప్లికేషన్ కాపీ తీసుకురావాలన్నారు. దాని ఆధారంగా మాత్రమే ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని చెప్పారు. ఎలాట్‌మెంట్ లెటర్‌లో పేర్కొన్న ప్రకారం ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురావాలని తెలిపారు. జిల్లాకు సంబంధించి బొమ్మూరులోని ప్రభుత్వ డైట్ కళాశాలకు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలన్నారు. నిర్దేశిత ఫీజులు ఆన్‌లైన్‌లో చెల్లించిన తరువాత ఫైనల్ అడ్మిషన్ లెటరు అందజేస్తామని తెలిపారు.
Advertisement
Advertisement