క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకోవాలి
క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకోవాలి
Published Sat, Aug 6 2016 11:15 PM | Last Updated on Mon, Feb 17 2020 5:11 PM
కొవ్వూరు : ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకుని రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ సూచించారు. కొవ్వూరులో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి జూనియర్ అండర్–17 బ్యాడ్మింటన్ పోటీలను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ కొవ్వూరులో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఎమ్మెల్యే కేఎస్ జవహర్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో మూడు మండలాల్లో మూడు స్టేడియంలు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.భవిష్యత్ కొవ్వూరు పురపాలక సంఘం సహకారంతో స్విమ్మింగ్ పూల్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. పారిశ్రామిక వేత్త అల్లూరి ఇంద్రకుమార్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడాల్లోను రాణించాలని సూచించారు. అనంతరం కలెక్టర్, ఇతర అతి«థులు క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కొద్దిసేపు బ్యాడ్మింటన్ ఆడి అలరించారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు, మునిసిపల్ చైర్మన్ సూరపనేని సూర్యభాస్కర రామ్మోహన్(చిన్ని), జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు చిట్టూరి సుబ్బారావు, ఆర్డీవో బి.శ్రీనివాసరావు, అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పొట్రు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి పొట్రు మురళీకష్ణ, ఎం.దుర్గాప్రసాద్, జి.గణపతి, ఎన్.సాయి తదితరులు పాల్గొన్నారు. శనివారం నిర్వహించిన పోటీల్లో 34 మంది క్రీడాకారులు సెమీక్వార్టర్‌కి చేరుకున్నారు. ఈ పోటీల్లో విజేతలైన క్రీడాకారులను క్వార్టర్ ఫైనల్‌కి ఎంపిక చేస్తామని చీఫ్ రిఫరీ కె.రమేష్ తెలిపారు.
Advertisement
Advertisement