in kvr
-
పంటకుంటలకు ప్రాధాన్యమివ్వండి
కొవ్వూరు రూరల్ : రైతులు పొలాల్లో పంట కుంటలు తవ్వేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి కేఎస్ జవహర్ ఆదేశించారు. శనివారం కొవ్వూరులోని మంత్రి కార్యాలయంలో ఇంకుడు గుంతలు, పంటకుంటలపై మండల పరిషత్, రెవెన్యూ, పంచాయతీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గోదావరి తీర ప్రాంతంలో ఉన్నప్పటికీ చాగల్లు మండలంలోని మల్లవరం, చిక్కాల గ్రామాల్లో భూగర్భజలాలు అతి తక్కువగా ఉన్నాయన్నారు. నీరు–ప్రగతి కార్యక్రమంలో చెరువుల పూడికతీత, కాలువల ఆధునికీకరణ, ఇంకుడుగుంతలు, ఫామ్పాండ్ల తవ్వకం ద్వారా భూగర్భ జలాలలను పెంపొందించుకోవచ్చన్నారు. దీనికి సంబంధించి గ్రామాల్లో కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కొవ్వూరు, తాళ్లపూడి తహసీల్దార్లు కె.విజయకుమార్, శ్రీనివాసరావు, ఎంపీడీవోలు ఎ.రాము, కె.పురుషోత్తమరావు, జ్యోతిర్మయి పాల్గొన్నారు. -
7న గోదావరికి మహా నీరాజనం
కొవ్వూరు :తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా నవంబర్ 7న గోదావరికి మహా నీరాజనం కనుల పండువగా నిర్వహించనున్నట్టు ఆర్డీవో బి.శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గోష్పాదక్షేత్రం స్నానఘట్టానికి ప్రతి కార్తీక సోమవారం భక్తుల రద్దీ ఎక్కువ ఉండే అవకాశం ఉన్నందున పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. గోదావరికి మహా నీరాజనం సమర్పించేందుకు స్నానఘట్టం వద్ద నదిలో మూడు పంట్లు ఏర్పాటు చేసి ప్రత్యేకమైన వేదికను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. టీటీడీ నుంచి తెచ్చిన భూదేవి, శ్రీ దేవి సమేత కలియుగ వేంకటేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. గోదావరిలో పెరిగిన ఒండ్రు మట్టి, చెత్త చెదారం తొలగింపునకు కలెక్టర్ రూ.లక్ష మంజూరు చేసినట్టు చెప్పారు. పారిశుధ్యం మెరుగ్గా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మునిసిపల్ కమిషనర్‌కి సూచించారు. భక్తులకు తాగునీరు, రక్షణ తదితర ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. -
గోదావరికి మహా నీరాజనం
కొవ్వూరు : గోష్పాదక్షేత్రంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా గోదావరికి విశేష పూజలు నిర్వహించారు. 128వ మాసోత్సవం లో భాగంగా తెన్నేటి సూర్యనారాయణ మూర్తి, అయ్యపురాజు సత్యనారాయణ రాజు దంపతుల చేతులు మీదుగా గణపతిపూజ, గౌతముడు, గోవు పూజలతో గోదావరి మాత విగ్రహానికి అషో్టత్తర శతనామ కుంకుమార్చన చేశారు. అనంతరం నదీ మాతకు మహానీరాజనం సమర్పించారు. నదీలో మహిళలు దీపాలు వెలిగిలించి దీపోత్సవం నిర్వహించారు. నీరాజన సమితి అధ్యక్షుడు కలిగోట్ల కృష్ణారావు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిపారు. -
డెల్టాకు నీటి విడుదల పెంపు
కొవ్వూరు : జిల్లాలో పశ్చిమ డెల్టా ఆయకట్టు పరిధిలో రైతుల సాగునీటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆదివారం నీటి విడుదలను స్వల్పంగా పెంచారు. గత రెండు రోజుల నుంచి ఏడు వేల క్యూసెక్కుల నీరు విడిచిపెడుతున్న అధికారులు అదనంగా మరో 300 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రధానంగా పశ్చిమడెల్టా పరిధిలోని ఏలూరు, అత్తిలి కాలువలకు శనివారం కంటే నీటి విడుదలను కాస్త పెంచారు. మిగిలిన కాలువలకు రెండు రోజుల నుంచి ఒకే మాదిరిగా సరఫరా చేస్తున్నారు. గోదావరి నుంచి విడిచిపెడుతున్న ఏడువేల క్యూసెక్కుల్లో ఉండి కాలువకు 1,714, నరసాపురం కాలువకు 2,020, గోస్తనీ(జీఅండ్‌వీ)కి 1,035 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. ఏలూరు కాలువకు 1,180 క్యూసెక్కుల నుంచి 1,246 క్యూసెక్కులకు, అత్తిలి కాలువకు 578 నుంచి 793 క్యూసెక్కులకు నీటి విడుదలను పెంచారు. తగ్గిన గోదావరి ఇన్‌ప్లో గోదావరిలో ప్రవాహ జలాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఆదివారం ఉదయం ఆరు గంటలకు ఇన్‌ఫ్లో 2,34,087 క్యూసెక్కులుగా నమోదైంది. సాయంత్రం ఆరు గంటలకు 2,22,341 క్యూసెక్కులకు ఇన్‌ఫ్లో తగ్గింది. -
అంత్య ఘట్టానికి..
సాక్షి ప్రతినిధి, ఏలూరు : గోదావరి అంత్య పుష్కరాలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. గురువారం కొవ్వూరులో అంత్యపుష్కరాల ముగింపు కార్యక్రమం నిర్వహించనున్నారు. పుష్కరుడికి వీడ్కోలు పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 5గంటల నుంచి గోష్పాద క్షేత్రంలో సభ, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విఘ్నేశ్వర పూజ, గౌతమ మహర్షి ధ్యానం, పుష్కరుడికి, సింహస్థ బృహస్పతికి అర్చన, గోదావరి పూజ, నీరాజనం సమర్పించనున్నారు. తుది అంకానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంత్య పుష్కరాల్లో 11వ రోజైన గురువారం జిల్లాలోని అన్నిఘాట్లలో 50 వేల మందికి పైగా భక్తులు పుష్కర స్నానాలు చేశారు. తాళ్లపూడిలో అర్చకులు జంధ్యాల అశ్వినికుమార్ ఆధ్వర్యంలో గోదావరికి హారతి ఇచ్చారు. ముగింపు సందర్భంగా తాళ్లపూడిలో ఉత్సవ మూర్తులతో రథయాత్ర నిర్వహించనున్నారు. నరసాపురంలోనూ భక్తుల రద్దీ పెరిగింది. వలంధర రేవు, అమరేశ్వ ఘాట్‌లో వేకువజామునుంచే భక్తులు పెద్ద ఎత్తున స్నానాలు చేసారు. ఘాట్ల వద్ద విపరీతమైన రద్దీ నెలకొంది. గోదావరి మాతకు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టిసీమ పుష్కర ఘాట్లోనూ çపుష్కర సాన్నాలు చేశారు. కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో వరద ఉధృతి కొనసాగడంతో 1, 2 ఘాట్లలో స్నానాలకు అనుమతించలేదు. నూతన ఘాట్‌లో సుమారు 30 వేల మందికి పైగా భక్తులు స్నానాలు ఆచరించారు. ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతోపాటు ప్రకాశం, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు. పుష్కరోత్సవాల ముగింపునకు భారీ ఏర్పాట్లు కొవ్వూరు : గోదావరి అంత్య పుష్కరాల ముగింపు సందర్భంగా పుష్కరుడికి ఘన వీడ్కోలు పలికేందుకు గోష్పాద క్షేత్రంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు వీడ్కోల ఉత్సవం నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం గోష్పాద క్షేత్రంలో భారీ వేదిక ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆర్డీవో బి.శ్రీనివాసరావు గోష్పాద క్షేత్రంలో ఏర్పాట్లను పరిశీలించారు. -
గోదావరి తల్లికి కోటిదండాలు
పర్వతాల వంటి పాపాలను సైతం ప్రక్షాళన గావించే పుణ్యగంగ.. చరిత్ర ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రాలతో అలరారే ఘనతరంగ.. బీడు భూముల్లో బంగారం పండించే జలధితరంగ.. మా గోదావరి తల్లీ.. నీకు కోటి దండాలు.. కొవ్వూరు: గోదావరి అంత్య పుష్కరాల పుణ్య స్నానాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. గోష్పాదక్షేత్రం ఘాట్‌లో 11వ రోజు బుధవారం భక్తుల రద్దీ కొనసాగింది. గోదావరి వరద ఉధృతి కొనసాగడంతో క్షేత్రంలోని పోలీసులు మొదటి రెండు ఘాట్లలో స్నానాలకు అనుమతించలేదు. నూతన ఘాట్‌లో సుమారు 30 వేల మందికి పైగా భక్తులు స్నానాలు ఆచరించారు. ఒడిస్సా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి, ప్రకాశం, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పిండ ప్రదానాలు అధిక సంఖ్యలో చేశారు. తాళ్లపూడి, కొవ్వూరు మండలాల పరిధిలోని రూరల్ ఘాట్‌ల్లో ఇరవై వేల మంది భక్తులు స్నానాలు ఆచరించారు. గురువారంతో అంత్య పుష్కరాలు ముగియనుండడంతో భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పుష్కరుడికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం ఐదు గంటల నుంచి గోష్పాదక్షేత్రంలో సభ, వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధం చే స్తున్నారు. ఇప్పటికే కలెక్టర్, ఆర్డీవోల పేరుతో పుష్కర వీడ్కోలు కార్యక్రమంపై పలువురికి ఆహ్వాన పత్రాలు పంపిణీ చేశారు. నరసాపురం జన గోదావరి నరసాపురం : నరసాపురం జన గోదావరిగా మారిపోయింది. అంత్యపుష్కర పర్వం చివరిదశకు చేరుకోవడంతో భక్తులు పోటెత్తారు. 11వ రోజు బుధవారం ఘాట్ల వద్ద విపరీతమైన రద్దీ నెలకొంది. వలంధర్‌రేవులో తెల్లవారుజాము నుంచి భక్తుల రద్దీ కనిపించింది. అధికారుల అంచనా ప్రకారం 20 వేల మంది స్నానాలు చేశారు. గోదావరి మాతకు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్నానాలు అనంతరం ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వలంధరరేవులో ఏర్పాటు చేసిన జల్లుస్నానం ప్రత్యే ఆకర్షణగా నిలిచింది. ఎక్కువ మంది భక్తులు, జల్లు స్నానాలు చేయడానికి మొగ్గు చూపారు. పిండ ప్రదానాలు చేసే వారి సంఖ్య కూడా పెరిగింది. మరోవైపు భక్తుల సంఖ్య పెరగడంతో ఏర్పాట్లలో లోపాలు కనిపిస్తున్నాయి. సిబ్బంది మొత్తం కృష్ణా పుష్కరాలకు తరలివెళ్లడంతో బందోబస్తుతో సహా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఘాట్ల వద్ద మంచినీరు సరఫరా వంటి లోపాలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకోవాలి
కొవ్వూరు : ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకుని రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ సూచించారు. కొవ్వూరులో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి జూనియర్ అండర్–17 బ్యాడ్మింటన్ పోటీలను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ కొవ్వూరులో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఎమ్మెల్యే కేఎస్ జవహర్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో మూడు మండలాల్లో మూడు స్టేడియంలు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.భవిష్యత్ కొవ్వూరు పురపాలక సంఘం సహకారంతో స్విమ్మింగ్ పూల్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. పారిశ్రామిక వేత్త అల్లూరి ఇంద్రకుమార్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడాల్లోను రాణించాలని సూచించారు. అనంతరం కలెక్టర్, ఇతర అతి«థులు క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కొద్దిసేపు బ్యాడ్మింటన్ ఆడి అలరించారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు, మునిసిపల్ చైర్మన్ సూరపనేని సూర్యభాస్కర రామ్మోహన్(చిన్ని), జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు చిట్టూరి సుబ్బారావు, ఆర్డీవో బి.శ్రీనివాసరావు, అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పొట్రు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి పొట్రు మురళీకష్ణ, ఎం.దుర్గాప్రసాద్, జి.గణపతి, ఎన్.సాయి తదితరులు పాల్గొన్నారు. శనివారం నిర్వహించిన పోటీల్లో 34 మంది క్రీడాకారులు సెమీక్వార్టర్కి చేరుకున్నారు. ఈ పోటీల్లో విజేతలైన క్రీడాకారులను క్వార్టర్ ఫైనల్‌కి ఎంపిక చేస్తామని చీఫ్ రిఫరీ కె.రమేష్ తెలిపారు. -
ఈ పోస్ ద్వారా ఎరువుల పంపిణీ సరళీకరణ
కొవ్వూరు రూరల్ : ఆధార్ ఆధారిత ఎరువుల పంపిణీని డీలర్లు సక్రమంగా అమలు చేయాలని డెప్యూటీ డైరెక్టర్ ఆప్ ఆగ్రికల్చర్ టి.సుధారాణి అన్నారు. స్థానిక లిటరరీ క్లబ్లో గురువారం కొవ్వూరు డివిజన్లోని ఎరువుల డీలర్లకు ఈ పోస్ యంత్రాల పంపిణీ, ఆధార్ ఆధారిత ఎరువుల సరఫరాపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన సుధారాణి మాట్లాడుతూ ఈ పోస్ యంత్రం పొందిన వెంటనే డీలర్లు తమ వద్ద ఉన్న ఎరువుల వివరాలను నమోదు చేయాలన్నారు. దీని వల్ల ఎరువుల పంపిణీలో జరిగే అవకతవకలు నివారించడానికి వీలవుతుందన్నారు. కొవ్వూరు, చాగల్లు, గోపాలపురం, తాళ్లపూడి మండలాల్లోని ఎరువుల డీలర్లు, సొసైటీలకు ఈ పోస్ యంత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో వ్యవశాయాధికారులు కె.వేణుగోపాల్, కె.ఏసుబాబు, కె. పవన్‌కుమార్, జె.రత్నప్రభ పాల్గొన్నారు.