ఈ పోస్‌ ద్వారా ఎరువుల పంపిణీ సరళీకరణ | make easy to supply pesticides by e poss | Sakshi
Sakshi News home page

ఈ పోస్‌ ద్వారా ఎరువుల పంపిణీ సరళీకరణ

Published Thu, Aug 4 2016 6:42 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

ఈ పోస్‌ ద్వారా ఎరువుల పంపిణీ సరళీకరణ - Sakshi

ఈ పోస్‌ ద్వారా ఎరువుల పంపిణీ సరళీకరణ

కొవ్వూరు రూరల్‌ : ఆధార్‌ ఆధారిత ఎరువుల పంపిణీని డీలర్లు సక్రమంగా అమలు చేయాలని డెప్యూటీ డైరెక్టర్‌ ఆప్‌ ఆగ్రికల్చర్‌ టి.సుధారాణి అన్నారు. స్థానిక లిటరరీ క్లబ్‌లో గురువారం కొవ్వూరు డివిజన్‌లోని ఎరువుల డీలర్లకు ఈ పోస్‌ యంత్రాల పంపిణీ, ఆధార్‌ ఆధారిత ఎరువుల సరఫరాపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన సుధారాణి మాట్లాడుతూ ఈ పోస్‌ యంత్రం పొందిన వెంటనే డీలర్లు తమ వద్ద ఉన్న ఎరువుల వివరాలను నమోదు చేయాలన్నారు. దీని వల్ల ఎరువుల పంపిణీలో జరిగే అవకతవకలు నివారించడానికి వీలవుతుందన్నారు. కొవ్వూరు, చాగల్లు, గోపాలపురం, తాళ్లపూడి మండలాల్లోని ఎరువుల డీలర్లు, సొసైటీలకు ఈ పోస్‌ యంత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో వ్యవశాయాధికారులు కె.వేణుగోపాల్, కె.ఏసుబాబు, కె. పవన్‌కుమార్, జె.రత్నప్రభ పాల్గొన్నారు.  
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement